ముఖతేజస్సును మెరుగుపరిచే పోషకాలు పుష్కలంగా కలిగివున్న పండ్లలో ‘ఆరెంజ్’ ఒకటి. ఆరోగ్యానికి మేలు చేసే పొషక విలువలు కలిగిన ఈ ఆరంజ్ పళ్లు.. అందానికీ కూడా మేలు చేస్తాయి. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా.. ముఖంపై మురికీ, జిడ్డు పేరుకుపోతుంటుంది. దాంతో అందం విహీనంగా మారడం, ముఖం నల్లగా కనబడటం వంటి సమస్యలు తప్పవు. వీటి నుంచి విముక్తి పొంది, ముఖ తేజస్సు పొందాలంటే.. ఖరీదైన క్రీములు, పౌడర్లూ వాడటం కంటే ప్రకృతిసహజంగా లభించే ఆరెంజ్ వాడటం ఎంతో శ్రేయస్కరమని నిపుణులు అంటున్నారు. కేవలం ఆరెంజ్ మాత్రమే కాదు.. మరెన్నో రెమెడీలున్నాయి. మరి.. ఆ రెమెడీలేంటో తెలుసుకుందామా..
* ముందుగా ఆరంజ్ తొక్కలను బాగా ఎండబెట్టి, వాటిని పొడికేసుకోవాలి. ఆ పొడిలో ఒక స్పూన్ నారింజ పొడిని ఓ పాత్రలో తీసుకుని, అందులో కాస్త పెరుగు వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేయాలి. 20 నిముషాల తర్వాత వేళ్లతో వలయాకారంగా రుద్దుతూ నీళ్లతో కడిగేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. ముఖానికి మంచి ఛాయ వస్తుంది.
* ముఖం మురికి దూరమయ్యేలా, మొటిమలు రాకుండా వుండాలంటే.. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటించాల్సి వుంటుంది. పడుకునే ముందు గులాబీ నీళ్లూ, గ్లిజరిన్ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని, ఉదయాన్నే కడిగేస్తే ముఖం తాజాగా మారుతుంది.
* ఒక టీస్పూన్ ముల్లంగి రసంలో నాలుగు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. ఇది బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేసి ముఖాన్ని శుభ్రపరుస్తుంది.
* ఒక పాత్ర తీసుకుని అందులో ఒక టీస్పూన్ బొప్పాయి గుజ్జు, ముల్తానీ మట్టీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్ ముఖాన్ని తాజాగా మారుస్తుంది.
* ఒక పాత్రలో కొద్దిగా ఓట్స్ తీసుకుని అందులో చిటికెడు పసుపు, కొన్ని చుక్కల నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నిముషాల తర్వాత కడిగేస్తే ముఖం తాజాగా మారుతుంది.
* ఒక పాత్రలో నాలుగు బాదం గింజలను మిశ్రమంలా చేసి, దానికి ఒక టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత చన్నీళ్లతో కడిగేస్తే మృదువైన చర్మం మీ సొంతమవుతుంది.
* ఒక పాత్రలో కొద్దిగా శెనగపిండి తీసుకుని, అందులో గులాబీ నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంటయ్యాక కడిగేస్తే.. మంచి ఫలితం కనిపిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more