పోషకాహారలోపం, వాతావరణ కాలుష్యం వంటి ప్రభావాల కారణంగా వివిధ రకాల చర్మ సమస్యలు ఎదురవుతాయి. చర్మంపై దుమ్ము, ధూళి చేరడంతో తెల్లగా వుండే చర్మం జిడ్డుగా-నల్లగా మారడం, మొటిమలు రావడం, నల్లని మచ్చలు, ముడతలు.. తదితరాలు వస్తుంటాయి. ఫలితంగా అందవిహీనంగా తయారవుతారు. అలాకాకుండా కొన్ని సహజ చిట్కాలను రెగ్యులర్ గా పాటిస్తే.. వివిధ రకాల చర్మసమస్యల నుంచి ఉపశమనం పొందడంతోపాటు ఎన్నో సౌందర్య ప్రయోజనాలు పొందవచ్చు. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..
* నుదుటిపై ఏర్పడే అడ్డగీతలను ఫర్రోలైన్స్ అంటారు. కనుబొమలను పైకి లేపే అలవాటున్న వాళ్లకు ఈ గీతలు తక్కువ సమయంలో ఏర్పడతాయి. ఈ గీతలు ఏర్పడకుండా చేయాలంటే.. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్‌తో కనుబొమల నుంచి పైవైపుకి సున్నితంగా వేళ్లను తిప్పుతూ మర్దన చేస్తే సరిపోతుంది. కొబ్బరినూనెతో మర్దనా చేసినా ఫలితం వుంటుంది. ఈ రెండు నూనెలు చర్మానికి తేమనిస్తాయి.
* లాఫింగ్ లైన్స్‌ను దూరం చేసుకోవాలంటే.. గుడ్డు తెల్లసొనను బాగా గిలకొట్టి గీతలపై రాసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయాలి. గుడ్డులోని తెల్లసొనను రాసి పూర్తిగా ఆరాక దానిపై మరోసారి గుడ్డుసొన రాయాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే ముడతలకు చెక్ పెట్టవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు.
* కొన్నిసార్లు మొటమలు పోయి, దాని మచ్చలు మాత్రం మిగిలిపోతుంటాయి. అలాంటప్పుడు కొబ్బరిపాలలో చెంచా గులాబీ నీళ్లు, నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే.. ఫలితం వుంటుంది. టేబుల్ స్పూన్ కొబ్బరి నీళ్లలో కాస్త పెసరపొడి కలపాలి. దీనికి చెంచా తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేసుకుంటే మచ్చలు తొలగిపోతాయి. రోజూ స్నానానికి ముందు చేస్తే మచ్చలు తగ్గుతాయి.
* తరచూ మృతకణాల సమస్య వేధిస్తుంటే.. కొబ్బరి తురుములో అరచెంచా చొప్పున పాలమీగడా, తేనె, నిమ్మరసం టేబుల్ స్పూన్ సెనగపిండి కలిపి మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. దాన్ని ఒంటికి నలుగులా రుద్దుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే నిర్జీవంగా మారిన చర్మం కొత్త కాంతిని పొందుతుంది.
* కీరదోస, నిమ్మరసాన్ని సమపాళ్లలో తీసుకుని దానికి చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయాన్నే ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసినా ఫలితం ఉంటుంది.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more