Experts Suggesting Some Simple Home Made Remedies To Get Glow Skin | Beauty Tips | Skin Care Remedies

Simple home made remedies to get glow skin beauty tips

glow skin remedies, glow skin tips, glow skin beauty tips, glow skin tips, glow skin products, beauty skincare tips, skincare beauty remedies, skin beauty health tips, skin health remedies, pimples remedies, black scars remedies

Simple Home Made Remedies To Get Glow Skin Beauty Tips : Experts Suggesting Some Simple Home Made Remedies To Get Glow Skin.

చర్మ సౌందర్యానికి సహజ చిట్కాలు

Posted: 10/02/2015 06:42 PM IST
Simple home made remedies to get glow skin beauty tips

చర్మ సౌందర్యాన్ని మెరుగుపర్చుకోవడం కోసం రకరకాల బ్యూటీ ప్రోడక్టులు వాడాల్సిన అవసరం లేదు.. బ్యూటీపార్లర్లకు వెళ్లాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇంట్లోనే లభ్యమయ్యే కొన్ని సహజ పధార్ధాలతో రెమెడీలు చేసుకుని, వాటిని చర్మానికి పట్టిస్తే కాంతివంతమైన సౌందర్యం సొంతం అవుతుంది. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..

* రెండు చెంచాల టమోటో గుజ్జులో, చెంచా కీరదోస గుజ్జూ, రెండు చెంచాల ఓట్స్ పొడీ, చెంచా పుదీనా ఆకుల మిశ్రమం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పావు గంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఈ ప్యాక్‌తో ముఖానికి తాజాదనం వస్తుంది. ఒక టమోటోని గుజ్జులా చేసి దానికి చెంచా నిమ్మరసం, అర చెంచా ఓట్స్ పొడీ కలిపి ముఖానికి రాసుకుని, కాసేపు వేళ్లతో రుద్దాలి. తరువాత చన్నీళ్లతో కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది.

* తాజా బొప్పాయిలో కొద్దిగా కొబ్బరిపాలు కలిపి.. ఆ మిశ్రమాన్ని చర్మానికి రాసుకుంటే చర్మం మృదువుగా, శాటిన్ లా, మెత్తగా మారుతుంది. దోమలు కుడితే నిమ్మరసంకు కొంచెం నీరు కలిపి దూదితో దోమ కుట్టిన చోట రుద్దితే మంట తగ్గిపోతుంది. నారింజ రసంోబ పాలు కలిపి ముఖానికి, చేతులకు నెలరోజులపాటు క్రమం తప్పకుండా పట్టిస్తే.. మచ్చలు, చర్మ సంబంధ సమస్యలు మాయమవుతాయి.

* రెండు చెంచాల టమోటో రసంలో మూడు చెంచాల మజ్జిగ వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి పట్టించి అర గంట తర్వాత చన్నీళ్లతో కడిగేస్తే ముఖం తాజాగా మారుతుంది. ఒక టమోటోని మెత్తగా చేసి దానికి చెంచా పెరుగూ, అరచెంచా తేనె, మూడు చెంచాల సెనగపిండీ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుని ఆరాక కడిగేస్తే ఫలితం ఉంటుంది.

* స్కిన్ టోనర్లకు బదులుగా చర్మానికి నిమ్మకాయ రసాన్ని వాడటం బెటరని బ్యూటీషన్లు అంటున్నారు. తద్వారా చర్మానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవని వారంటున్నారు. అలాగే చర్మాన్ని పరిశుభ్రపరచడానికి ఒక మెరుపులాంటి ఛాయను ఇవ్వడానికి మాయిశ్చరైజింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ చేసుకోవాలి.

* టమోటాలో చర్మానికి మేలు చేసే బోలెడు పోషకాలున్నాయి. జిడ్డు చర్మం ఉన్నవారికి టమోటాలు చాలా బాగా ఉపయోగపడతాయి. టమోటాని సగానికి కోసి ముఖానికి, చేతులకు రుద్ది.. పావుగంట తర్వాత కడిగేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. చర్మం శుభ్రపడుతుంది.. బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి.. చర్మ రంద్రాలు శుభ్రపడతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : glow skin remedies  skin problems beauty tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more