శిరోజాల అందాన్ని మెరుగుపరచడంలో సహజసిద్ధమైన పచ్చని ఆకులు ప్రముఖ పాత్ర పోషిస్తాయని బ్యూటీషియన్లు అంటున్నారు. నిపుణులు జరిపిన పరిశోధనల్లో భాగంగా.. ఈ ఆకులు ఏ విధంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయో.. అలాగే శిరోజాల అందాన్ని కాపాడటంలోనూ ముందున్నాయని తేలింది. అందుకే.. కేశాల సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే రసాయనాల వాడకం లేకుండా సహజసిద్ధమైన ఈ ఆకులను వాడటమే ఎంతో శ్రేయస్కరమని చెబుతున్నారు.
* కొబ్బరినూనెలో తగినన్ని కరివేప ఆకులను వేసి మరిగించి, చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి, మసాజ్చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేయడం వల్ల జుట్టు రాలడం, తెల్లబడటం వంటి సమస్యలు తగ్గుతాయి. కొబ్బరినూనెలోని ప్రొటీన్లు జుట్టుకుదుళ్లకు బలాన్ని ఇస్తాయి. కరివేపాకు కేశాలు చిట్లకుండా మాయిశ్చరైజర్లా ఉపయోగపడుతుంది. లీటర్ నీటిలో గుప్పెడు వేప ఆకులు వేసి మరిగించాలి. ఈ నీళ్లు చల్లారాక తలకు పట్టించాలి. పది-ఇరవై నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత శుభ్రపరచుకోవాలి. వారానికి నాలుగుసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే జుట్టు రాలడం తగ్గుముఖం పడుతుంది.
* తులసి ఆకులో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. అలాగే మన ఆరోగ్యానికి ఉపయోగపడే వందల రకాల ఓషధులు తులసిలో ఉన్నాయి. గుప్పెడు తులసి ఆకులను ముద్దగా నూరి, అర లీటర్ నీటిలో వేసి మరిగించాలి. ఈ నీరు చల్లారిన తర్వాత తలకు పట్టించి, పది నుంచి పదిహేను నిమిషాలు ఉంచి కడిగేయాలి. వెంట్రుక చిట్లడం తగ్గుతుంది. రక్తప్రసరణ మెరుగవుతుంది. కుదుళ్లు బలపడి వెంట్రుకల ఎదుగుదల బాగుంటుంది. వారానికి ఒకసారైనా తులసి చికిత్స శిరోజాలకు ఎంతో మేలు చేస్తుంది.
* జామ ఆకు... ఇది కురుల కుదుళ్లను బలపరచడమే కాదు, నిగనిగలనూ పెంచుతుంది. లీటర్ నీటిలో గుప్పెడు జామ ఆకులను వేసి అరగంటసేపు అలాగే ఉంచాలి. తర్వాత ఆ నీటిని మరిగించి, పూర్తి వేడి తగ్గేంతవరకు ఉంచాలి. ఆ తర్వాత వడకట్టి, ఆకులను తీసేయాలి. ఇప్పుడు ఈ నీటిని జుట్టు కుదుళ్లకు పట్టించాలి. జామ ఆకులో ఉండే ఔషధగుణాలు మరిగించడంతో నీటిలోకి వచ్చేస్తాయి. ఆ నీటిని తలకు వాడటం వల్ల కుదుళ్లు బలపడి, జుట్టు రాలడం తగ్గుతుంది.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more