Young tiger ntr dammu movie review

young tiger ntr dammu movie review

young tiger ntr dammu movie review

3.gif

Posted: 04/27/2012 01:31 PM IST
Young tiger ntr dammu movie review

da_inn

సినిమా:                 ‘దమ్ము’
నిర్మాత:                 కె.ఎ.వల్లభ
సమర్పకులు :         కె.ఎస్‌.రామారావు
దర్శకుడు:              బోయపాటి శ్రీను
స్టార్ కాస్ట్: జూనియర్ ఎన్టీఆర్, త్రిష, కార్తీక, నాజర్, సుమన్, తనికెళ్ల భరణి, భాను ప్రియా,బ్రహ్మానందం,అలీ,శుభలేక సుధాకర్ తదితరులు
సంగీతం దర్శకుడు:     ఎం.ఎం కీరవాణి
రచన:                     ఎమ్‌.రత్నం
పాటలు:                   చంద్రబోస్‌
కెమెరా:                    ఆర్థర్‌ విల్సన్‌
రేటింగ్:                    2.5
          ఎన్నో అంచనాలతో భారీ గా రూపుదిద్దుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ – బోయపాటి శ్రీను మూవీ ‘దమ్ము’ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా తీరుతెన్నులు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.


కథ : 

        ‘దమ్ము’ మూవీ ప్రధానంగా సిస్టర్‌ సెంటిమెంట్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. నటి అభినయ ఎన్టీఆర్ సిస్టర్‌గా నటించింది. తన సోదరికి జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా హీరో చేసే ప్రతీకారం చూపరులకు పూర్తి స్థాయి హింసాత్మకంగా ఉంది. అనాధైన ఎన్టీఆర్ ను ఒకానొకకారణంతో ఒక రాయల్ ఫ్యామిలీ దత్తత తీసుకుంటుంది. తదనంతర పరిణామాలు తెరపైనే చూడాలి.  ఈ చిత్రంలో ఎన్టీఆర్ తల్లిగా భానుప్రియ నటించగా, కోట శ్రీనివాసరావు తాత గా నటించాడు. ప్రేమించిన అశ్విన గా నటించిన  ‘త్రిష’ ను పొందే క్రమంలో నాజర్ విలన్ పాత్ర పోషించాడు.

        ఆరంభం నుంచీ సినిమాలోని కొన్ని సందర్భాలు :  బ్లాక్ అండ్ వైట్ లో ఒకానొకప్పుటి రెండు కుటుంబాలను పరిచయం చేశారు.  నాజర్, సుమన్ ఫైట్ తో టైటిల్స్ మొదలవుతాయి. అనంతరం  ఇరవై ఐదు సంవత్సరాలు తర్వాత  జూ.ఎన్టీఆర్... రాజా వాసిరెడ్డి గా ఎక్స్టార్డనరీ ఫైట్ తో ఎంట్రీ ఇస్తాడు...అశ్విని గా త్రిష పరిచయం. ఎన్టీఆర్ ..త్రిషను ట్రై చేస్తాడు. ‘ఓ పిల్ల’ పాట పిక్చరైజేషన్ ఎన్టీఆర్, త్రిషల మీద సాగింది.
        త్రిష-ఎన్టీఆర్ మధ్య డైలాగ్స్ :  త్రిష: నీ బ్యాక్ గ్రౌండ్ చెప్పు.. ఎన్టీఆర్: నా బాంక్ లో 68 లక్షలు ఉన్నాయి.. త్రిష: నాకు 6 వేల కోట్లు ఉంది.. ఎన్టీఆర్: అంటే నా ఆస్ధి 68 లక్షల ఆరు వేల కోట్లు సంభాషణ ఆకట్టుకుంటుంది. అనంతరం కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందంలతో కలిసి విలేజ్ లోకి ఎంట్రీ ఇస్తాడు. వేణు క్యారెక్టర్ పరిచయం..ప్యామిలీ సెంటిమెంట్, అబినయ చెల్లెలుగా ఎంట్రీ..  మగధీరలోలాగ ఎన్టీఆర్ కి ఏదో ప్లాష్ బ్యాక్ గుర్తుస్తోంది.. రూలర్ సాంగ్ లో ఎన్టీఆర్ గెటప్ సూపర్..  కార్తీక ఎంట్రీ అదుర్స్ అనిపించింది.  కార్తీక మాటి మాటికి నన్ను ఉపయోగించుకోండి అంటుంది...త్రిష వేసేస్తాను అంటుంది. దమ్ము పట్టుకున్న కత్తి లో ఉండదు రా రక్తంలో ఉండాలి...ఎన్టీఆర్ డైలాగ్

విశ్లేషణ :

    ‘దమ్ము’ పూర్తి స్థాయి ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశించి రూపొందించిన సినిమాలానే అగుపిస్తుంది. స్టోరీ, కాన్సె ప్ట్ మంచిగా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే విసుగు పుట్టించేలా ఉంది. శ్రుతిమించిన హింస చిత్రానికి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. హీరో – విలన్ల మధ్య జరిగే సంభాషణ ఆశక్తి కరంగా సాగినప్పటికీ డైలాగ్స్ అభిమానులను మాత్రమే పూర్తిస్థాయిలో సంత్రుప్తి పరిచేలా ఉన్నాయి. ‘ఆ వంశంలో వాళ్లకి రక్తం లో పోటెక్కువ ప్రతీ చుక్క పోటెత్తుంది’. ‘సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసేది ఎగిరి కొరకడానికే’ వంటి  డైలాగులు పండాయి.  ఎన్టీఆర్ డైలాగు పాటల్లో ఎన్టీఆర్ డ్యాన్స్ అబ్బుర పరిచేలా ఉంది. కొన్ని సన్నివేశాలు ‘మగధీర’ ‘సింహాద్రి’ సినిమాలను గుర్తుకు తెస్తాయి. బావ పాత్రలో వేణు రక్తి కట్టించాడు. 

సాంకేతిక వర్గం పనితీరు :

    ఫైట్స్ నడుస్తున్నప్పుడు వచ్చే నేపథ్య సంగీతం ఔరా అనిపించేలా సాగింది. సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్ బావున్నాయి.

నటీనటుల పనితీరు :   

        ఎన్టీఆర్ తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేకూర్చాడు. హీరోయిన్లు త్రిష, కార్తీక అందాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి, వారి వారి నటన ఓకే. బ్రహ్మానందం, అలీ కామెడీ ఫర్వాలేదనిపించింది. మిగతా తారాగణమంతా వారి వారి పరిధి మేరకు బాగానే మెప్పించారు.

చివరి మాట :

      మొత్తంగా ‘దమ్ము’ సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నచ్చే సినిమా. 

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  May second weak kaarti movie sekuni movie audio release
Ntr dammu movie release all over the world today in nearly 1250 theaters  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles