Kareena saif marriage date fixed

kareena saif marriage date fixed

kareena saif marriage date fixed

31.gif

Posted: 06/04/2012 06:34 PM IST
Kareena saif marriage date fixed

29...     

      4 యావన్మంది సినీ ప్రియులకు బాలీవుడ్ వారి పెళ్లి పిలుపహో........ బాలీవుడ్‌  ప్రేమ పావురాలు కరీనాకపూర్, సైఫ్ అలీ ఖాన్ల వివాహంపై సస్పెన్స్‌కు తెరపడింది. అక్టోబర్‌ 16న ఈ జంట ఒక్కటి కానుంది. ఈ విషయాన్ని సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్‌ స్వయంగా ప్రకటించారు. బాలీవుడ్‌లో వీరిద్దరూ అనేక కథనాలకు కేంద్రబిందువులయ్యారు. ఒకరేమో.. నవాబ్‌ పటౌడీ సాబ్ పుత్రరత్నం. మరొకరు.. కపూర్‌ ఫ్యామిలీలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌. ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. కరీనా బాలీవుడ్‌లోనే హయ్యస్ట్ పెయిడ్ యాక్ట్రస్‌. ఆమె ఏ సినిమాలో యాక్ట్ చేసినా.. హిట్టే. ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలన్నీ.. సూపర్‌ హిట్‌ కావడంతో బెబో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. చాలారోజులుగా కరీనా.. సైఫ్‌ అలీ ఖాన్‌ మధ్య ప్రేమాయణం నడుస్తోంది. పెళ్లి దగ్గరికి వచ్చేసరికి... ఇదిగో... అదుగో అంటూ దాట వేస్తోందీ జంట. అసలు వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారా.. లేదా.. సహజీవనం చేస్తూ కాలం గడిపేస్తారా అనే ప్రశ్నలు చలాకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కరీనా తల్లికాబోతోందనే వార్తలు కూడా కలకలం రేపింది. అయినా వీరిద్దరూ ఇప్పటి వరకూ పెదవి విప్పలేదు. కానీ కరీనా.. సైఫ్ పెళ్లిపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది.    

      మొత్తానికి సైఫ్‌ - కరీనాల వివాహంపై ఊహాగానాలకు సైఫ్‌ అలీఖాన్‌ తల్లి షర్మిలా ఠాగూర్‌ తెర దించారు. అక్టోబర్‌ 16న వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని ఆమె ప్రకటించారు. పెళ్లి తర్వాత రిసెప్షన్‌ ఉంటుందని చెప్పిన ఆమె.. అది సింపుల్‌గానే నిర్వహిస్తామని వెల్లడించారు. పటౌడీల నివాసంలో జరిగే ఈ వివాహం హడావుడి లేకుండా సింపుల్‌గా నిర్వహించాలని భావిస్తున్నట్టు వీరిద్దరి సన్నిహితులు చెపుతున్నారు. ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు, స్నేహితులు మాత్రమే వివాహానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. సైఫ్‌ కరీనాల పెళ్లి వార్తలపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి తర్వాత కరీనా తెరపై కనిపిస్తుందా అనేది మాత్రం స్పష్టం కాలేదు. అయితే షర్మిలా ఠాగూర్‌ పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించారు. కరీనా కూడా అదే రూట్‌ను ఫాలో అవ్వాలని కోరుకుందాం....

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gabbar singh sensational records
Namita attend a marriage function  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles