వామ్మో..వాయ్యో.. గబ్బర్ సింగ్ కలెక్షన్లు చూస్తుంటే అందరికీ మతులు గతులు తప్పుతున్నాయి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా కలెక్షన్స్ అంతటా చర్చనీయాంశంగా మారాయి. నేషనల్ మీడియా సైతం ఈ చిత్రం గురించి ఓ రేంజిలో అప్ డేట్స్ ఇస్తోంది. ఈ విషయాన్ని నేషనల్ డెయిలీ తెలిపింది. ప్రముఖ పత్రిక 'బిజినెస్ స్టాండర్డ్'లో గబ్బర్ సింగ్ కలెక్షన్స్ పై ఓ ఆర్టికల్ ప్రచురించింది. ఆ అర్టికల్ లో గబ్బర్ సింగ్ కలెక్షన్ల వివరాలు మతిపోయేలా చేస్తున్నాయి. ఆ పత్రిక జూన్ ఒకటి వరకు చెప్పిన ప్రకారం... గడిచిన మూడు వారాల్లో 128.75 కోట్లు కలెక్టు చేసింది. గ్లోబెల్ మార్కెట్ లో ఈ చిత్రంకి వచ్చిన రెస్పాన్స్, కలెక్షన్స్ తో ఈ లెక్కలు ప్రచురించారు. దబాంగ్ చిత్రం 173 కోట్లు కలెక్టు చేసి టాప్ 5 బాలీవుడ్ చిత్రాలులో ఒకటిగా నిలిచిందని దాన్ని గబ్బర్ సింగ్ బీట్ అవుట్ చేసినట్లే అన్నారు. గబ్బర్ సింగ్ చిత్రం 30 కోట్లతో నిర్మించి 2,857 స్క్రీన్స్ తో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసారని, ఆ ఎక్కువ థియేటర్లలో విడుదల చేసిన ఘనత ఈ సినిమాకు దక్కుతుందని ఆ పత్రిక చెప్పుకొచ్చింది. ఈ విషయమై బాలీవుడ్ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ కామెంట్ ని యాడ్ చేసారు. తరుణ్ ఆదర్శ్ మాట్లాడుతూ..హిందీ సినిమాలు విడుదలయ్యే వన్ ధర్డ్ స్క్రీన్స్ లో ఈ చిత్రం విడుదల అయ్యింది. కానీ అంతకంటే పెద్దదిగా నిలిచింది. అమెరికాలో 43 స్క్రీన్స్ తో ఈ చిత్రం విడుదలైంది.
ఈ నేపధ్యంలో గబ్బర్ సింగ్ ఒరిజనల్ చిత్రం దబాంగ్ హీరో సల్మాన్ ఖాన్ స్పందించారు. ఆయన ఈ కలెక్షన్స్ ని చూసి షాక్ అయ్యారు. తమిళంలో ఓస్తి పేరుతో శింబుతో చేసినా వర్కవుట్ కాని ఈ సినిమా పూర్తి మార్పులతో తెలుగులో చేయటాన్ని, అది పెద్ద హిట్టవటాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇన్నాళ్లూ తెలుగు హీరోల చిత్రాలు తాను రీమేక్ చేస్తూంటే.. ఇప్పుడు తన చిత్రం రీమేక్ చేసి అంత పెద్ద హిట్ కొట్టడం మీద సల్మాన్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. అన్ని వర్గాల మద్దతును కూడగట్టుకున్న గబ్బర్ సింగ్ ... పవన్ అభిమానులకు ఎప్పటికీ కురుతీరిపోయే హిట్ ఇచ్చిందన్న మాట.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more