Uday kiran coming with different look

uday kiran coming with different look

uday kiran coming with different look

1.gif

Posted: 06/20/2012 01:58 PM IST
Uday kiran coming with different look

   1ee  లవర్ బాయ్ ఉదయ కిరణ్ అంటే,  ఒకప్పుడు అతనంటే యూత్ లో విపరీతమైన క్రేజ్. 'చిత్రం' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఈ యంగ్ హీరో, ఆ తరువాత 'నువ్వు నేను' ... 'మనసంతా నువ్వే' వంటి చిత్రాలతో కుర్రకారు ప్రేక్షకులని తన అభిమానులుగా చేసుకున్నాడు. అయితే ఆ తరువాత అతను ఏ సినిమా పడితే ఆ సినిమాని ఒప్పుకోవడం ... అవి పరాజయాల పాలుకావడం జరిగింది. దాంతో అప్పటివరకూ అతను సాధించిన సక్సెస్ లు పాలపొంగులా చప్పున చల్లారి పోయాయి. ఈ నేపథ్యంలోనే కొత్త కథానాయకులు దూసుకురావడంతో, అతనికి తెలుగు తెరతో ఎక్కువ గ్యాప్ ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఉదయ్ కిరణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోంది.
     ఉదయ్ కిరణ్‌ తన కెరీర్‌లో తొలిసారిగా పోలీస్‌ నేపథ్యంలో యాక్షన్‌ సినిమా చేస్తున్నారు. బాలాజీ ఎన్‌సాయి దర్శకత్వంలో ఫైవ్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తేళ్ల రమేష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజుల్లో ఫేమ్‌ రేష్మా ఇందులో కథానాయిక. ఈనెల 18న హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలైంది. 1eఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఉదరుకిరణ్‌ ఇప్పటివరకూ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఈచిత్రం వుంటుంది. ఆయన గెటప్‌ కూడా కొత్తగా వుంటుంది. ఇందులో ఆయన క్రైంబ్రాంచ్‌ పోలీస్‌ అధికారిగా నటిస్తున్నారు. లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ల కలబోత ఇది. ఇందులో ఐదుపాటలుంటాయి అనిచెప్పారు.
     నిర్మాత మాట్లాడుతూ ఈనెల 18న తొలిషెడ్యూల్‌ మొదలైంది. నెలాఖరువరకూ హైదరాబాద్‌లోనే జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో 2పాటలు, కీలకసన్నివేశాలు, 2యాక్షన్‌ ఎపిసోడ్స్‌ చిత్రీకరిస్తాం. సంగీత దర్శకుడిగా డాఖేను పరిచయం చేస్తున్నాం' అని చెప్పారు.
     నాగినీడు, చలపతి రావు, ఎమ్మెస్‌ నారాయణ, రావురమేష్‌, పృథ్వీ, తాగుబోతు రమేష్‌ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి కెమెరా, టెక్నికల్‌ సపోర్ట్‌: డీజీపోస్ట్‌, సహనిర్మాత: ఎంసిహెచ్‌ రాజేష్‌, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బాలాజీఎన్‌.సాయి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Venki mehar ramesh movie shadow shooting disrupt
Puri jagannath raviteja movie devudu chesina manushulu new posters release  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles