రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది భక్తిరస చిత్రం 'శిరిడీసాయి'. ఈ చిత్రం ఓ మహత్తర చిత్ర రాజంగా వర్థిల్లుతుందని యావత్ తెలుగు చిత్ర సీమ భావిస్తోంది. శిరిడి సాయి పాత్ర పోషించిన నాగ్ మాటల్లో ఈ చిత్రం గురించి.... ‘సాయి పాత్రలో నటించడం ఓ మధురమైన అనుభూతిని కలిగించింది. ఈ పాత్రలో నటించడం వల్ల నటుడిగా నా జన్మ ధన్యమైంది. ప్రారంభంలో ఈ పాత్రను తాను చేయగలనా? లేదా? అని సంశయించాను ... అయితే మనస్పూర్తిగా ఆ పాత్రలో లీనం కావడంతో బాగా వచ్చింది. సాయి పాత్ర చేయడం కోసం ఆయన గురించి పూర్తిగా తెలుసుకున్నా... ఆయన ఆచరించిన సూత్రం - అనుసరించిన మార్గం నన్నుఎంతగానో ప్రభావితం చేశాయి. సమానత్వం ... ప్రేమతత్వమే సాయితత్వమని తెలిసింది ... ఎంతో పవిత్రతని పాటిస్తూ ఈ పాత్రని పోషించాను. అందరికీ ఆదర్శనీయంగా నిలిచే ఈ పాత్రలో నటించే అవకాశం దక్కడం తన పూర్వ జన్మ సుకృతం’ అన్నారు అక్కినేని నాగార్జున. రేపు ఈ సినిమా రిలీజ్ అవుతోన్న తరుణంలో చిత్ర యూనిట్ మీడియాతో కొద్ది సేపటి క్రితం ముచ్చటించింది.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more