Allu arjun surender reddy movie conform

allu arjun surender reddy movie conform, taman music, writer vakkantam vamsi, producers nallmalapu bujji, k venkateswara rao

allu arjun surender reddy movie conform

14.gif

Posted: 09/05/2012 05:02 PM IST
Allu arjun surender reddy movie conform

        ఆంధ్రవిశేష్ సందర్శకులకు నెలముందే బన్నీ (అల్లు అర్జున్)తో దర్శకుడు సురేందర్ రెడ్డి చిత్రం రూపుదిద్దుకుంటుందని సమాచారం ఇచ్చాం. ఇప్పుడు ఆ వార్త అధికారికంగా.. చిత్రం ఖరారయిందని వెలువడింది. సురేందర్ రెడ్డి ఆస్థాన కథా రచయిత వక్కంతం వంశీ ఈ banny_surender_fసినిమాకోసం కథను అందించాడు. నల్లమలుపు బుజ్జి ... డాక్టర్ కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా నవంబర్ రెండో వారంలో ప్రారంభం కానుంది. భారీ బడ్జెట్టుతో రూపొందుతోన్న ఈ సినిమాకి తమన్ స్వరాలను సమకూరుస్తున్నాడు. బన్నీ సినిమాకి అతను మ్యూజిక్ అందించడం ఇదే మొదటిసారి. 'కిక్' చిత్రం తరువాత సురేందర్ రెడ్డి చేసిన 'ఊసరవెల్లి' చిత్రం హిట్ చిత్రాల జాబితాలో చోటు చేసుకోలేకపోయింది. దాంతో బన్నీతో ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నట్టు తెలుస్తోంది. అలాగే, 'జులాయి' చిత్రానికి దేవిశ్రీ ఇచ్చిన సంగీతానికి మంచి స్పందన లభించడంతో, ఆ స్థాయిని దాటే స్వరాలను కంపోజ్ చేయాలనే కసి తమన్ లో కనిపిస్తోంది. ఇక సురేందర్ రెడ్డి సక్సెస్ గ్రాఫ్ పక్కన పెడితే, ఆయన టేకింగ్ స్టైల్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనీ ... తన బాడీ లాంగ్వేజ్ కి అది బాగా ఉపయోగపడుతుందని బన్నీ భావిస్తున్నాడు. ఇలా ఈ సినిమాపై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. వాళ్లంతా వాటిని చేరుకోవాలనే ఆశిద్దాం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sada navdeep friendship
Nagarjuna siridisai movie release tomarrow  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles