Akkineni nageswararao birthday

akkineni-nageswararao-birthday, nagarjuna,amala, annapurnamma, akhil

akkineni-nageswararao-birthday

44.1.png

Posted: 09/20/2012 09:38 PM IST
Akkineni nageswararao birthday

        అక్కినేని.. ఎంతోకాలంగా తెలుగు చిత్ర సీమను ఏలుతున్న పేరు. అక్కినేని నాగేశ్వరరావు... జీవితాన్ని గెలిచిన వ్యక్తి.., akkineni_3.11కాదుకాదు.. మహాశక్తి.... అంతటి వ్యక్తి ఇవాళ మరో నూతన వసంతం లోకి అడుగుపెట్టారు. అతని పుట్టిన రోజు వేడుకను యావత్ ఆంధ్రదేశం పండుగలా నిర్వహించుకుంది. రాష్ట్రంలోని అక్కినేని అభిమానులంతా కేక్స్ కట్ చేయటంతో పాటు పలు సేవాకార్యక్రమాల్లోనూ పాలుపంచుకున్నారు.  ఈ ధీరుడి నటప్రస్థానం ఇప్పుడు...  తెలుగు సినిమా 'మూకీ' నుంచి 'టాకీ' లోకి అడుగు పెట్టి, నడక వేగాన్ని పెంచుతోన్న రోజులవి. అలాంటి పరిస్థితుల్లో 'సీతారామ జననం' చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన అక్కినేని, తెలుగు కథను ... పాత్రలను ... పాటలను పరిగెత్తించారు. చురుకుగా ... చలాకీగా తెర పై సందడి చేస్తూ పడుచు మనసులను పడగొట్టేసి తొలి రొమాంటిక్ హీరోగా చరిత్రలో నిలిచిపోయారు. ఓ వైపున పౌరాణిక ... సాంఘిక ... జానపద ... చారిత్రకాల్లో ఎన్టీఆర్ తనదైన ముద్ర వేస్తూ వెళుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆయనకి పోటీని ఇవ్వాలంటే, నటనలో తన ప్రత్యేకతను ఆవిష్కరించాలని అక్కినేని భావించారు. రొమాంటిక్ హీరోగా ఆ ప్రత్యేకతను ప్రదర్శించడమే సరైనదిగా భావించి akkineni_inn1.1ఆయన ఆ దిశగా ముందుకి సాగిపోయారు.  తొలి నాళ్ళలోనే ఎన్టీఆర్ తో కలిసి నటిస్తూ, తన నటనలోని వైవిధ్యాన్ని ప్రేక్షకులు గుర్తించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక 'దేవదాసు' సినిమాలో ఆయన పోషించిన పాత్రని ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. అంతేకాదు, నాగేశ్వరరావు కథానాయికలతో, ఆయన తిరుగులేని కెమిస్ట్రీ వర్కౌట్ చేసేవారు. అందుకే 'దొంగ రాముడు' ... 'పూలరంగడు' ... మూగమనసులు' ... 'డాక్టర్ చక్రవర్తి' ... దసరాబుల్లోడు' ... ప్రేమనగర్' వంటి చిత్రాలు ఆయన సాధించిన ఘన విజయాలకి ఆనవాళ్ళుగా కనిపిస్తాయి.  'మాయాబజార్' ... 'శ్రీకృష్ణార్జున యుద్ధం' వంటి పౌరాణికాల్లోను, 'మిస్సమ్మ' ... 'గుండమ్మ కథ' వంటి సాంఘికాల్లోను, 'చాణక్య చంద్ర గుప్త' వంటి చారిత్రకాల్లోను ఎన్టీఆర్ తో కలిసి దాదాపు 14 చిత్రాల్లో నటించి ఆయన రికార్డు సృష్టించారు. సుధీర్గ మైన తన నట ప్రస్థానంలో  దాదాపు 63 మంది నాయికలతో కలిసి ఆడిపాడారు. ఇక ఓ వైపున రొమాంటిక్ హీరోగా కథానాయికల కొంటె మనసులను కొల్లగొడుతూనే, 'విప్రనారాయణ' ... 'బుద్ధిమంతుడు' ... 'భక్త తుకారం' ... చక్రధారి' వంటి భక్తిరస చిత్రాలలోనూ నటించి మెప్పించారు. అక్కినేని అంటే ఆకాశమంత అభినయం కావడంతో 'పద్మశ్రీ' ... 'పద్మ భూషణ్' ... 'పద్మ విభూషణ్' ... 'దాదాసాహెబ్ ఫాల్కే' వంటి అవార్డులు ఆయనని అలంకరించాయి. ఇంతటి నటసామ్రాట్టుకు తెలుగువిశేష్ జన్మదిన శుభాకాంక్షలు అందిస్తోంది..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bollywood salmankhan incometax
Power star new still  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles