మొత్తానికి ఎన్నో రోజులుగా ఊరిస్తున్న ‘రుద్రమ దేవి’ సినిమా పై వస్తున్న ఊహగానాలకి గుణ శేఖర్ తెరదించాడు. ఆయన రాణి రుద్రమ దేవి మీద సినిమా తీయబోతున్నట్లు గత సంవత్సర కాలం నుండి ఊహగానాలు నడుస్తున్నాయి. తాను రుద్రమ దేవి అనే సినిమా తీయబోతున్నట్లు గుణ శేఖర్ అధికారికంగా ప్రకటించి అనుష్క పుట్టిన రోజైన ఇవాళ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
అంతేకాదు ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “గత పదేళ్లుగా ఈ సినిమా చేలని అనుకుంటూ వస్తున్నాను. ఒక్కడు సినిమా తరువాత ఈ సినిమానే చేద్దామనుకున్నాను. కానీ హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ కావడంతో స్టార్ హీరోలు లేకుండా ఇంత భారీ సినిమా చేయడానికి ధైర్యం సరిపోలేదు. శ్యాం ప్రసాద్ రెడ్డి గారు తీసిన ‘అరుంధతి, రాజమౌళి తీసిన ‘ఈగ’ సినిమాలు ఎలాంటి స్టార్ హీరోలు లేకుండా స్టార్ హీరోల స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా హిట్ కావడంతో నాక్కూడా ధైర్యం వచ్చి ఈ సినిమా స్టార్ట్ చేయబోతున్నాను. ఇండియాలో వస్తున్న మొట్టమొదటి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి సినిమా ఇది. అనుష్క ప్రధాన పోషిస్తుంది. ఈ సినిమాతో నేను నిర్మాతగా కూడా మారుతున్నాను. గుణా టీం వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నాను. ఇళయరాజా గారు సంగీతం అందించబోతున్నారు. వచ్చే ఏడాది 2013 ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రారంభమవుతుంది” అని వెల్లడించారు.
ఇక బర్త్ డేల విషయానికొస్తే.. ‘అనుష్క’.. ఈ స్వీటీ కర్ణాటక లోని మంగ్లూరులో జన్మించింది. 'సూపర్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ఆ తరువాత వచ్చిన 'మహానంది' చిత్రం ఆమె ఉనికిని చాటి చెప్పగా, 'విక్రమార్కుడు' తో తొలి ఘన విజయాన్ని అందుకుంది. ఆమె నటినాపటిమతో 'అరుంధతి' చిత్రంలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో ఆమె పలికించిన వీర - రౌద్ర రసాలకు ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పటికీ ఆమెని అంతా జేజెమ్మా అని పిలుస్తున్నారంటే 'అరుంధతి' గా ఆమె వాళ్ళపై ఎంతటి ప్రభావాన్ని చూపించిందో తెలుస్తోంది. ఆ తరువాత ఆమె వరుసబెట్టి సినిమాలు చేసినప్పటికీ, 'వేదం' సినిమాలో ఆమె పోషించిన వేశ్య పాత్రకి ఎక్కువ ఆదరణ లభించింది. మిగతా కథానాయికలు ఈ తరహా పాత్ర కోసం ఇప్పటికీ ఎదురు చూస్తున్నారంటే, ఆ పాత్రతో ఆమె కలిగించిన స్ఫూర్తి ఎలాంటిదనేది అర్ధమౌతుంది. ఈ మధ్య కాలంలో తమిళ సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా తెలుగు సినిమాల సంఖ్య తగ్గించిన అనుష్క, 'డమరుకం' సినిమాతో ప్రేక్షకుల ముందుకి మళ్లీ రానుంది. ఇక 'అరుంధతి' లో అనుష్క ప్రదర్శించిన నటనా పటిమ, ఆమెకు 'రాణి రుద్రమ'లో అవకాశాన్ని తెచ్చిపెట్టింది. కాకతీయుల సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చారిత్రాత్మక చిత్రం ఫస్ట్ లుక్ ను ఆమె పుట్టినరోజు కానుకగా విడుదల చేశారు.
ఇంకా, నేటి బర్త్ డే బాయ్స్.. లోకనాయకుడు కమల్ హాసన్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్వీటీ అనుష్క శెట్టి, తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు కూడా నవంబర్ 7 న అంటే ఇవాళే పుట్టారు. కమల్ హాసన్ 1954 నవంబర్ 7న పరంకుడిలో జన్మించారు. కమల్ హాసన్ అంటేనే నటనకు పారాకాష్ట.
‘త్రివిక్రమ్’.. 1972 నవంబర్ 7న భీమవరంలో జన్మించారు. మొదట్లో మాటల రచయితగా ఇండస్ట్రీకి వచ్చి నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారి ప్రస్తుతం తెలుగులో అగ్ర దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఇక వెంకట్ ప్రభు విషయానికి వస్తే 1975లో పుట్టాడు. అతని సినిమాలకు తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. సరోజ, గ్యాంబ్లర్ వంటి సినిమాలు యువతను బాగా ఆకట్టుకున్నాయి. వీరందరికీ ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు అందిస్తోంది.. తెలుగువిశేష్..కాం
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more