Ntr baadshah first look teaser

ntr baadshah, baadshah first look teaser, ntr baadshah first look, ntr baadshah teaser, ntr baadshah director, ntr baadshah casting, ntr baadshah working stills, ntr baadshah wallpapers, ntr baadshah crew, ntr baadshah srinu vytla, rupa vitla

ntr baadshah first look teaser

3.gif

Posted: 01/16/2013 12:46 PM IST
Ntr baadshah first look teaser

         baadshah_f

         యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ హిట్స్ డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘బాద్ షా' చిత్రం లోగో ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ అఫీషియల్ లోగో కొంచెం సేపటిక్రితం విడుదలైంది.  టైటిల్ ఎడ్జ్  మెరుస్తూ ఉండేలా డిజైన్ చేశారు. ఎన్టీఆర్‌ హీరోగా ఈ మూవీలో కాజల్‌ కథానాయిక. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత. ఈ నెల 16 నుంచి చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ మొదలవుతుంది. ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
         ఈ చిత్రం గురించి ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ‘అభిమానులు నన్ను ఎలా చూడాలనుకొంటారో అదే తరహాలో ఉండబోతోంది 'బాద్‌షా'. ఇందులో నా వేషధారణ, హావభావాల దగ్గర్నుంచి ప్రతి విషయంపైనా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొంటున్నారు దర్శకుడు. నా కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రంగా నిలుస్తుంది’అన్నారు.
      డైరెక్టర్ శ్రీను వైట్ల మాట్లాడుతూ ‘ఎన్టీఆర్‌ ఇమేజ్‌కి తగ్గట్టుగా చిత్రాన్ని తీర్చిదిద్దాం. వినోదం, భావోద్వేగాలు, యాక్షన్‌... ఇలా అన్ని అంశాలూ సమపాళ్లలో ఉంటాయి. ఎన్టీఆర్‌ని సరికొత్తగా చూపించబోతున్నాం. వేసవికి వస్తున్న ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకీ వినోదం పంచుతుంది’ అని తెలిపారు. 
       టీజర్ లో 'బాద్‌షా డిసైడైతే.. వార్‌ వన్‌సైడ్‌ అయిపోద్ది...' అని చెప్పే డైలాగ్ కు  విపరీతమైన స్పందన కనిపిస్తుంది. ఫ్యామిలీ అండ్ హిల్లేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడు.
        ఎన్టీఆర్- కాజల్ కాంబినేషన్లో ఇప్పటికే బృందావనం లాంటి హిట్ వచ్చింది. మరోవైపు రెడీ, దూకుడు లాంటి చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రీను వైట్ల ఈ సారి అంతకు మించిన ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టుతో ‘బాద్ షా' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ ‘బాద్ షా' చిత్రానికి పని చేస్తుండటం విశేషం. ఈ చిత్రం విజయం మీద నిర్మాత బండ్ల గణేష్ పూర్తి నమ్మకంతో ఉన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Srikanth addala ntr combination
Actress lavanya tripati with manchu majoj  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles