టాలీవుడ్ లో ఒకప్పుడు ప్రేమ కథా చిత్రాలు చేసి లవర్ భాయ్ గా పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ కి ఆ తరువాత అవకాశాలు లేకుండా పోయాయి. తెలుగు నుండి తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ అప్పుడప్పుడు ఓ సినిమా చేస్తూ నేను ఇంకా ఉన్నానని చెప్పుకుంటున్న ఈయన ఇటీవల ‘జై శ్రీరామ్ ’ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో విడుదల అయింది. ఇంత వరకు బాగానే ఉంది కానీ... ఉదయ్ కిరణ్ బడాయి మాటలు చూస్తే ఎవరికైనా అబ్బో అనిపిస్తుంది. ఈయన ఈ సినిమాకు సంబంధించిన కార్యక్రమంలో మాట్లాడుతూ... ‘రజనీసార్, కమల్ సార్, ప్రకాష్ రాజ్ సార్ లాంటి నటదిగ్గజాలను పరిచయం చేసిన బాలచందర్ గారే ' పొయ్ ' సినిమాతో నన్ను తమిళ తెరకు పరిచయం చేశారు. ఈ మధ్యకాలంలో నా పరిస్థితుల దృష్ట్యా ఆయన నమ్మకాన్ని వమ్ము చేస్తానేమో అనిపించింది. కానీ, మళ్లీ ఈ సినిమాతో విశ్వాసం కుదరింది. రజనీ, కమల్ స్థాయికి చేరుకోగలననిపించింది అంటూ బడాయి మాటలు మాట్లాడాడు. దీంతో అక్కడ వారు ఈయనకు ఈ అవకాశం రావడమే గొప్ప, అలాంటిది కమల్, రజినీల స్థాయికి వెళతాననడం విచిత్రంగా ఉందని అక్కడి వారు అనుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more