Hero arya comment on anjali

hero aarya, actress anjali, varudu fame arya, anjali, arya, anjali is a very good co-star, anjali missing,

hero-arya-comment-on-anjali

అంజలి చాలా మంచమ్మాయి

Posted: 04/13/2013 12:30 PM IST
Hero arya comment on anjali

అంజలి చాలా మంచమ్మాయి అనీ, తను ఇలా కనిపించకుండా దాక్కోవడం ఆశ్చర్యకరంగా ఉందనీ హీరో ఆర్య అన్నారు. అంజలి, హన్సికతో కలిసి ఆయన నటించిన 'సెట్టై' సినిమా తెలుగులో 'క్రేజీ' పేరుతో విడుదలైంది. ఆర్. కణ్ణన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఎస్.కె. పిక్చర్స్ పతాకంపై సురేశ్ కొండేటి అందించారు. ఈ చిత్రాన్ని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో పత్రికలవారికి ప్రదర్శించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆర్య పాల్గొన్నారు. "ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. అయితే వాటిని సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి. అంజలి ఇలా మనుషులకు కనిపించకుండా దాక్కోవాలనే నిర్ణయం ఎందుకు తీసుకుందనేది ఆమెకే తెలిసిన విషయం. వృత్తిపరంగా తను చాలా అంకిత భావం ఉన్న మనిషి. ప్రతిభావంతురాలు. సహజ నటి. సెట్స్ మీద అందరి తోటీ చాలా మర్యాదగా నడచుకుంటుంది'' అని ఆయన చెప్పారు. 'ఢిల్లీ బెల్లీ'కి రీమేక్ అయిన 'క్రేజీ' ప్రేక్షకులనందర్నీ ఆహ్లాదపరుస్తున్నదని ఆర్య తెలిపారు. "ఇదివరకు తెలుగులో 'వరుడు' సినిమాలో విలన్‌గా చేయడాన్ని ఆస్వాదించాను. నాకు ఆఫర్ చేసిన కేరక్టర్ ఆసక్తికరంగా అనిపిస్తే అది ఎలాంటిదైనా చేస్తాను. ప్రస్తుతం సెల్వ రాఘవన్ డైరెక్షన్‌లో 'ఇరండమ్ ఉలగమ్' సినిమా చేస్తున్నా. అనుష్క హీరోయిన్. తమిళంతో బాటు తెలుగులోనూ ఏక కాలంలో రిలీజవుతుంది'' అని ఆయన చెప్పారు. నిర్మాత సురేష్‌ కొండేటి మాట్లాడుతూ-‘‘ఆర్య, అంజలి, హన్సికల నటన హైలైట్‌. నా గత చిత్రాలను మించి ఈ సినిమా ఆరంభ వసూళ్లను రాబడుతోంది. మన ప్రేక్షకాభిరుచికి తగ్గ సినిమా’’ అన్నారు. అంజలి ఎక్కడున్నా బైటికి వచ్చి..నిర్మాతలకి సహకరించాలని ఈ సందర్భంగా కొం డేటి విజ్ఞప్తి చేశారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles