Sampath nandi to direct gabbar singh 2

pawan kalyan, gabbar singh 2, gabbar singh director confirm, sampath nandi, sampath nandi directs pawan kalyan, gabbar singh sequel, harish shankar

sampath nandi to direct gabbar singh 2

సంపత్ నందికి 'గబ్బర్‌సింగ్-2' దర్శకత్వ బాధ్యతలు

Posted: 04/13/2013 12:50 PM IST
Sampath nandi to direct gabbar singh 2

పవన్‌కళ్యాణ్ నటించిన 'గబ్బర్‌సింగ్' చిత్రం ఘనవిజయం సాధించడంతో ఆ చిత్రానికి సీక్వెల్ తయారుకానున్నదనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ చిత్రం సెకండ్ పార్ట్‌కి నిర్మాత పవన్‌కళ్యాణ్ అనీ, పవన్‌కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బేనరుపై ఆయనే నిర్మిస్తారని కూడా వార్తలు వినిపించాయి. అలాగే ఈ సీక్వెల్‌కి దర్శకుడు ఎవరనే విషయంలో కూడా రకరకాల పేర్లు వినిపించాయి. ఆ ఊహాగానాలకు తెరదించుతూ సంపత్ నందిని ఈ చిత్రానికి దర్శకునిగా సంపత్ నందిని పవన్‌కళ్యాణ్ ఎంపిక చేశారు. రామ్‌చరణ్ హీరోగా 'రచ్చ' చిత్రాన్ని రూపొందించి మెగాఫ్యామిలీ ప్రశంసలు అందుకొన్న ఈ యువ దర్శకునికి ఏడాది తిరగకుండానే లభించిన మరో మెగా ఆఫర్ ఇది. పవన్‌కళ్యాణ్ సన్నిహిత మిత్రుడు శరత్ మరార్ ఈ చిత్రానికి నిర్మాత. పవన్‌కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సమర్పణలో ఈ చిత్రం షూటింగ్ మే చివరి వారంలో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం షూటింగ్ పూర్తికాగానే ఈ చిత్రంలో షూటింగ్‌లో పవన్‌కళ్యాణ్ పాల్గొంటారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles