Colors swati in london bridge

swati swamy ra ra, swati prithviraj, swati malayalam movie, swati anil menon, swati malayalam offer, swati london bridge

TV artiste turned actor, Swati seems to be on cloud9 after the success of Swamy Ra Ra movie

కలర్ ఫుల్ గా కలర్స్ స్వాతి కెరియర్

Posted: 04/20/2013 03:01 PM IST
Colors swati in london bridge

బుల్లి తెర పై ‘కలర్స్ ’ ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయి, ఆ తరువాత వెండి తెర పై అరంగ్రేటం చేసి, ‘అష్టాచమ్మా ’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి, ఆ తరువాత పలు హిట్ చిత్రాల్లో నటించింది. కానీ ఆ మధ్యలో ఈ అమ్మడుకు సరైన అవకాశాలు రాలేదు. ఇటీవలే... స్వామి రా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి విజయం సాధించింది. దీంతో ఇక అవకాశాలు దండిగానే వస్తాయనుకుంటున్న సమయంలో డబల్ బోనాంజా లాగా మళయాళంలో కూడా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న స్వాతి మల్లూ వుడ్ లో నటించిన 'ఆమెన్' అనే సినిమా కూడా మంచి విజయాన్ని సాధించడంతో అక్కడ దశ తిరిగింది. ఈ సినిమా విజయంతో అక్కడ కూడా పెద్ద హీరోల సరసన మంచి ఆఫర్లను పట్టేస్తుంది. 'ఉరిమి', 'పోలీస్ పోలీస్' సినిమాలతో మంచి ఫాంలో ఉన్న పృథ్వీరాజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో స్వాతిని తాజాగా  హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ సినిమాకు 'లండన్ బ్రిడ్జ్' అనే టైటిల్ ను నిర్ణయించారు. ఇక ఈ భామ ప్రస్తుతం తమిళంలో మరో రెండు సినిమాలు చేస్తుండగా తెలుగులో నవదీప్ హీరోగా తెరకెక్కుతున్న బంగారు కోడిపెట్ట అనే సినిమాలో కూడా నటిస్తుంది. చేతి నిండా సినిమాలతో కలర్స్ స్వాతి లైఫ్ కలర్ ఫుల్ గా సాగిపోతుందని అనుకుంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles