Hero sumanth women getup in telugu movie

hero sumanth women getup, emo gurram egaravachu movie, sumanth women getup, emo gurram egaravachu censor,emo gurram egaravachu release

hero sumanth women getup, emo gurram egaravachu movie, sumanth women getup, emo gurram egaravachu censor,emo gurram egaravachu release

అమ్మాయి వేషంలో అదరగొడుతున్న సుమంత్

Posted: 12/26/2013 10:18 AM IST
Hero sumanth women getup in telugu movie

అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చి కెరియర్ మొదట్లో రెండు మూడు హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగే సమయంలో సరైన హిట్లు లేక వెనకబడిపోయిన హీరో సుమంత్ గత కొంత కాలం నుండి వెండితెర పై కనిపించకుండా పోయాడు. ఆ మధ్యలో ‘దగ్గరగా దూరంగా ’ అంటూ ఓ సారి ప్రేక్షకుల్ని పలకరించిన మళ్లీ ఎప్పుడు ‘ఏమో గుర్రం ఎగురవచ్చు ’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

చంద్ర సిద్దార్థ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సుమంత్ లేడీ గెటప్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో సుమంత్ వేసిన ఆడవేశానికి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు హల్ చల్ చేస్తుంది. ఈ ఫోటోలో సుమంత్ అచ్చం ఆడపిల్లలా ముద్దొచ్చేలా ఉన్నాడు. ఈ ఫోటో చూసిన సినీ జనాలు హీరోకి ఈ కళ కూడా వుందా ? అని అనుకుంటున్నారు.

చీరకట్టులో వయ్యారాలు పోతూ డ్యాన్స్ చేస్తున్న సుమంత్ ఫోటో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటుంది. దర్శకుడు రాజమౌళి సోదరుడు కాంచి చిత్రానికి కథను అందించాడు. సుమంత్ సరసన పింకీ సావిక హీరోయిన్. ఈ లేడీ గెటప్ లో ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles