Veena malik ties knot with businessman

veena malik ties knot, pak actress veena malik, wedding veena malik, veena malik marries, pak businessman

Pakistani actress Veena Malik has tied the knot with businessman Asad Bashir Khan Khattak in Dubai Wednesday.

దుబాయ్ బిజినెస్ మేన్ తో వీణా పెళ్ళి

Posted: 12/25/2013 09:33 PM IST
Veena malik ties knot with businessman

పాకిస్థాన్ హాట్ మోడల్ , శ్రుంగార తార వీణా మాలిక్ ఓ ఇంటిది అయ్యిందా ? రహస్యంగా ఈమె వివాహం చేసుకుందా ? అంటే ఈమె ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫోటోలను బట్టి అవుననే అనిపిస్తుంది. వీణామాలిక్ పర్సనల్ అకౌంట్ నుండి వచ్చిన ఈ ఫోటోలు ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.

ఈ ఫోటోలు పోస్ట్ చేస్తూ... ‘ఐ ఫౌండ్ మై సోల్ మేట్... మై ఫ్రెండ్.. మై పార్టనర్!!!  అంటూ ట్వీట్ చేసింది. వీణా మాలిక్ తన సొంత ట్విట్టర్ ఖాతాలో పొందుపరిచిన సమాచారం మేరకు... దుబాయ్‌కు చెందిన ఓ పారిశ్రామికవేత్తను ఎమిరేట్స్ కోర్టులో వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. తన తండ్రి స్నేహితుడి కుమారుడినే ఆమె చేసుకున్నట్లు, త్వరలో అందరినీ పిలిచి విహాహ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారట. ఇంతకీ ఈ వార్తలపై వీణా మాలిక్ మాత్రం మీడియా ముఖంగా స్పందించక పోవడం గమనార్హం.

దీని పై అనుమానాలు వ్యక్తం చేస్తున్న సినీ జనాలు పూనమ్ పాండే, తనీషా సింగ్ లాంటి వారు పండగ సందర్భంగా హాట్ హాట్ గా ఫోజులిచ్చి పబ్లిసిటీ సంపాదించుకుంటే, వీణా మాలిక్ కూడా అలాంటి స్టంట్ లో భాగంగానే ఇలా పోస్ట్ చేసిందని అనుకుంటున్నారు. ఏది ఏమైనా వీణా మీడియా ముందుకు వచ్చి చెబితేగానీ అసలు విషయం బయట పడదు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles