Big fight between mahesh and charan

ram charan and mahesh, ram charan,mahesh charan,mahesh babu vs Ram charan, Mahesh Babu, Tollywood, Sankranti,ram charan tej, mahesh Babum, Yevadu movie, One Nenokkadine movie, box office collections,

Sankranthi releases of Mahesh Babu-starrer 1 Nenokkadine and Ram Charan Yevadu are out and both the films focused on setting right expectations.

సంక్రాంతి బరిలో ఎవరిది పై చేయి ?

Posted: 01/08/2014 05:33 PM IST
Big fight between mahesh and charan

టాలీవుడ్ ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ మంచి సెంటిమెంటు. ఈ సీజన్ లో చాలా సినిమాల్ని విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తారు. గత కొంత కాలం నుండి భారీ సినిమాలు లేక వెండితెర వెలవెలబోతుంది. ప్రేక్షకులు కూడా మంచి మాస్ అండ్ ఎంటర్ టైనర్ కోసం ఎదురు చూస్తున్న తరుణం కూడా. మొన్నటి వరకు చాలా మంది హీరోలు సంక్రాంతి బరిలో దిగుతారని అనుకున్నారు.

కానీ చివరికి ఇద్దరు బడా హీరోలు ఈ రేసుకు రెడీ అయ్యారు. వారే మహేష్ బాబు, రామ్ చరణ్. భారీ బడ్జెట్ తో తెర కెక్కిన వీరిద్దరి సినిమాలు రెండు రోజుల తేడాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వీరిద్దరి సినిమాల రాకతో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ కోలాహలంగా తయారయ్యింది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ రెండు సినిమాల పై వారి వారి ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. తొలిసారి సుకుమార్ దర్శకత్వంలో మహేష్ హీరోగా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించిన ‘1’ నేనొక్కడినే సినిమా పై తొలి నుండి భారీ అంచనాలే ఉన్నాయి.

ఇప్పటికే అన్నిట్లో రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమాను భారీ స్థాయిలో అత్యథిక థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఒక్క హైదరాబాద్ లోనే మొదటి రోజు 600 షోలు ప్రదర్శిస్తున్నారంటే.... రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇంతలా ప్రదర్శించడానికి కారణం లేకపోలేదు. ఈ సినిమా విడుదలైన మరో రెండు రోజులకే రామ్ చరణ్ ‘ఎవడు ’ వస్తుండటంతో ఆ రెండు రోజుల్లోనే చాలావరకు కలెక్షన్స్ రాబట్టడానికి ‘1’ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఏ విధంగా చూసినా డిస్ట్రిబ్యూటర్ షేర్ 60 కోట్లు వస్తేనే పెట్టిన పెట్టుబడి తిరిగివస్తుందట

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ‘ఎవడు ’ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఎప్పుడో విడుదలకు సిద్దంగా ఉన్నా, కొన్ని పరిస్థితుల ద్రుష్ట్యా వాయిదా పడుతూ పడుతూ జనవరి 12న ముహూర్తాన్ని ఫైనల్ చేసుకొని ‘1’ కి సవాల్ విసరబోతుంది.

పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో రూపొందిన ఈ సినిమా కూడా ట్రైలర్లు, సాంగుల విషయంలో మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు పెరిగాయి. మల్టీ స్టారర్ గా వస్తున్న ఈ చిత్రం పై రామ్ చరణ్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. ‘తుఫాన్ ’ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వడకపోవడంతో ఈటైంలో ఖచ్చితంగా హిట్టు కావాలి కూడా.

ఓవైపు మహేష్ మూడు సినిమాలతో హ్యాట్రిక్ కొట్టి మంచి ఫాంలో ఉంటే, చరణ్ డిజాస్టర్ తో ఉన్నాడు. ఏది ఏమైనా మరో రెండు రోజుల్లో టాలీవుడ్ లో ఇద్దరి స్టార్ల మధ్య బిగ్ ఫైట్ తో పాటు, ఈ సంక్రాంతి సీజన్ కోట్లు కొల్లగొట్టబోతుందన్న మాట. వీరిద్దరిలో ఎవరు పై చేయిగా నిలుస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles