Chiranjeevi hot satires on tollywood young heroes

chiranjeevi, race gurram,allu arjun,shruti hassan,saloni aswani,surender reddy, chiranjeevi hot satires, chiranjeevi hot satires on tollywood young heroes.

chiranjeevi hot satires on tollywood young heroes

రేసు గర్రుం వేదిక పై చిరంజీవి చురకలు

Posted: 03/17/2014 11:33 AM IST
Chiranjeevi hot satires on tollywood young heroes

కేంద్రమంత్రి చిరంజీవి , అల్లు అర్జున్ నటించిన  రేసుగుర్రం ఆడియో ఫంక్షన్ కు ముఖ్యఅతిథిగా రావటం జరిగింది.  అయితే  ఆడియో వేదిక పై చిరంజీవి  చిత్ర పరిశ్రమ గురించి కొన్ని విషయాలను  చెప్పటం జరిగింది. చిరంజీవి మాట్లాడుతూ..  నేటి యంగ్ హీరోలకు చురకలంటించారు.  

ప్రస్తుత హీరోలు నిర్మాతను అంతగా పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. "ఈవేళ నిర్మాత అన్నవాడు డబ్బు పెట్టే క్యాషియర్ గా మారిపోయాడు. చాలా మంది హీరోలు నిర్మాతను పక్కకు జరగమంటున్నారు. అన్నీ హీరోలే చూసేసుకుంటున్నారు.

నిర్మాతలకు విలువ ఇవ్వడం లేదు. సినిమాలో నిర్మాత ఇన్వాల్వ్మెంట్ వుంటే అది సూపర్ డూపర్ హిట్టవుతుంది.  మనకు ఎంత మిగులుతోంది? అన్నదే కాకుండా చివరికి నిర్మాతకు ఎంత మిగులుతోంది? అన్నది కూడా పట్టించుకోవాలి. 

నిర్మాతని బాగోగులు చూడాలి. అప్పుడే మంచి సినిమాలు వస్తాయి. నిర్మాతను వెనుక పెట్టడం కాకుండా ముందుకు తీసుకురావాలని చిరంజీవి అన్నారు.  సినిమాయే కాదు ... నిర్మాత కూడా హిట్టవ్వాలి. అప్పుడే సినిమా ఇండస్ట్రీ కి పేరు వస్తుందన్నారు.  

అంతేకాకుండా.. హీరోలు .. అనవసరమైన ఖర్చలు చేయకుండా.. నిర్మాతను సేవ్  చేయాలని  చిరంజీవి సూచించారు. అంతే కాకుండా హీరోల రిమ్మునేరేషన్ విషయంలో కూడా కొంచెం ఆలోచించాలని  నేటి హీరోలకు  కేంద్ర మంత్రి చిరంజీవి  సూచించారు. చిరంజీవి మాటలను ..నేటి హీరోలు ఎంత మంది పాటిస్తారో చూద్దాం. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles