Race gurram allu arjun tongue slip on shruti haasan

Allu Arjun, Race Gurram, Allu Arjun Race Gurram movie, Tollywood Stylish star Allu Arjun, Allu Arjun tongue slip on Shruti Haasan, chiranjeevi, allu aravind, Bunny, never slip the tongue again

Race Gurram: Allu Arjun tongue slip on Shruti Haasan

శృతి హాసన్ పై నోరు పారేసుకున్న బన్నీ ?

Posted: 03/17/2014 03:43 PM IST
Race gurram allu arjun tongue slip on shruti haasan

అసలే  దేశముదురు, పైగా జులాయి కావటంతో.. మనవాడికి నోటికి హద్దు ఆపులేకుండా పోతుందని  అల్లు అర్జున్  గురించి ‘‘రేసుగుర్రం’’ ఆడియో ఫంక్షన్ వచ్చిన  సినీ పెద్దలు మాట్లాడుకుంటున్నారు.  అసలు ఇంతకీ మన బన్నీ  హీరోయిన్ శృతి హాసన్ పై నోరు పారేసుకున్నందుకు  సినీ పెద్దలు మండిపడుతున్నారు. అదీ కూడా  తండ్రి  అల్లు  అరవింద్, మామయ్య చిరంజీవి, రేసు గుర్రం ఆడియో వేదిక పై ఉన్నప్పుడే.. శృతి హాసన్ పై నోరు పారేసుకున్నాడు.   

కానీ పబ్లిక్ వేడుకలలో అయితే ఆచితూచి మాట్లాడాల్సిన బన్నీ. ఇలా తన  ఒరిజినాలిటీ బయటకు రావటంతో    అనవసరంగా బుక్కైనట్లు  తెలుస్తోంది. ఇంతకీ బన్నీ ఎమ్మన్నాడనేగా.. రేసు గుర్రం సినిమాలో తనతో కలిసి నటించిన శృతి హాసన్ గురించి మాట్లాడుతూ.. 'కమల్ హాసన్' ఒక సూపర్ స్టార్.. అయినా శృతి హాసన్.. తను ఖర్చుపెట్టే ప్రతి రూపాయి తనే సంపాదించుకోవాలని కష్టపడుతుంది.

నా హీరోయిన్ 'శృతి హాసన్'ను చూసి నేను గర్వపడుతున్నానని చెప్పాడు.  ఇంతవరకు  బన్నీ చెప్పిన దానిపై  చప్పట్లు కొట్టారు.  అభిమానులు  నుండి  భారీ స్పందన రావటంతో.. బన్నీలో ఉన్న ఒరిజినాలిటీ బయకు  రావటం జరిగింది.  ఆ సమయంలో బన్నీ మాట్లాడుతూ.. నేను అప్పుడప్పుడు శృతితో అంటుంటాను. నీకెందుకు.. హ్యాపీగా మీనాన్న ఇచ్చిన డబ్బులతో బ్యాగులు కొనుకున్ని షాపింగ్ చేసుకోక.. ఇలా కష్టపడతావు.. 'నీ అమ్మా' అన్నాడు.

అయితే ఇది పబ్లిక్ పంక్షన్ అని వేదిక మీదనే నాన్న అల్లు అరవింద్, మావయ్య చిరంజీవి ఉన్నారని అర్ధం కావడంతో నాలుక కరచుకొని సారీ చెప్పేశాడు.   కానీ దీనిపై శృతి హాసన్ ఏమంటుందో చూడాలి. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles