Race gurram telugu movie releasing april 11

Race Gurram telugu movie releasing April 11, Allu Arjun Race Gurram movie, Shruti Haasan, Prakash Raj, Suhasini, Kota Srinivasa Rao

Race Gurram telugu movie releasing April 11

వచ్చే వారం సినిమా రేసులో రేసుగుర్రం

Posted: 04/05/2014 04:10 PM IST
Race gurram telugu movie releasing april 11

అల్లు అర్జున్ ప్రధానపాత్రలో నటించిన రేసుగుర్రం సినిమా వచ్చే వారం విడుదలౌతోంది.  సినిమా కథలో పట్టున్నా లేకపోయినా వినోదం మాత్రం కావలసినంత ఉంటుందని అంచనా.  ఎందుకంటే ఈ మధ్యకాలంలో వినోదానికి ప్రాధాన్యతనిచ్చిన సినిమాలే ఎక్కువగా ఆదరణకు నోచుకుంటున్నాయి. 

బన్నీ ఉన్నాడంటే డ్యాన్స్ లకు ఫైట్లకైతే కొదవుండదని అందరికీ తెలుసు.  శ్రుతి హాసన్ కూడా ఈ సినిమాలో చలాకీతనంలో రేసు గుర్రంలా నటించిందని చెప్పుకుంటున్నారు.  సహ నటుడుగా శ్యామ్, మరో హీరోయిన్ సలోనీ, విలనీ చూపించటానికి కోటా శ్రీనివాసరావు, రవి కిషన్ లు ఉన్నారు.  హాస్యం పండించటానికి బ్రహ్మానందం, ఎమ్ఎస్ నారాయణ, అలీ, రఘు బాబు, పోసాని, జయప్రకాశ రెడ్డి ఉన్నారు.  కారెక్టర్ యాక్టర్స్ ప్రకాశ్ రాజ్, సుహాసినిలు ఉన్నారు.  ఇంకేం కావాలి?  ఈ కాంబినేషన్ లో చక్కని కథ అల్లవచ్చు! 

ఔను అలాగే జరిగింది కూడా అంటున్నారు చిత్ర బృందం. వక్కంతం వంశి రచించిన కథకు సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో చిత్రీకరణ జరగగా థమన్ సంగీతం అద్ది దానికి గుబాళింపు తెచ్చే ప్రయత్నం చేసారు. 

కేరళలో అల్లు అర్జున్ అభిమానులున్న మళయాళ భాషీయుల కోసం ఈ సినిమాను 'లక్కీ ది రేసర్' అనే పేరుతో విడుదల చేస్తున్నారు.  ఈ సినిమాకి యుఏ సర్టిఫికెట్ లభించింది.

ఇక ఏప్రిల్ 11 వరకు వేచివుండటమే మనం చెయ్యగలిగింది!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles