మంచు ఫ్యామిలీకి చెందిన వారు ఈ మధ్య ఎక్కువ కాంట్రవర్సీ సినిమాలు తీయడమే కాకుండా, నటిస్తున్నారు. మొన్నటి వరకు మంచు విష్ణు, మోహన్ బాబు, మనోజ్ ల సినిమా ల పై ఏదో ఒక కాంట్రవర్సీ వచ్చింది. ఇప్పుడు మంచు లక్ష్మి కూడా చేరబోతుంది. సిగరెట్ తాగడం యూత్ కి ప్యాషన్. అబ్బాయిలే కాకుండా, అమ్మాయిలు కూడా సిగరెట్ తాగుతూ కనిపిస్తున్నారు.
ఈ అలవాటు సినీ ఇండస్ట్రీలో తారలకు కూడా ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు. చాలా మంది హీరోయిన్లు ధుమపానం చేస్తారు. కొన్ని సినిమాల్లో హీరోయిన్లచే సిగరెట్ తాగించిన సన్నివేశాలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి సన్నివేశంలోనే మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి నటించి అందరికి షాక్ ఇచ్చింది. ఈమె తాజాగా నటించిన ‘చందమామ కథలు ’ సినిమాలో సిగరెట్ కాల్చింది. దీనికి సంబంధించిన పోస్టర్ ని ఇటీవలే విడుదల చేశారు కూడా. ఎంతో స్టైల్ గా సిగరెట్ కాలుస్తూ కనిపిస్తున్న ఈ పోస్టర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
ఇదే విషయం పై మంచు లక్ష్మిని ప్రశ్నించగా ఇలా కనిపిండం వల్ల యువత చెడిపోతుందని తెలుసు. కానీ సినిమాలో పాత్ర కోసమే మాత్రం అలా చేశాను. దీనికి నేను కూడా పూర్తి వ్యతికం, దీని పై ఆందోళన కూడా చెందుతున్నానని చెప్పుకొచ్చింది. అయితే సినిమా జనాలు మాత్రం ఓ సెలబ్రెటీ అయి ఉండి సిగరెట్ కాల్చడమే కాకుండా, ఇలా పోస్టర్లతో పబ్లిసిటీ చేయడం అవసరమా ? తెలుగు సినిమాల పేరుతో కొందరు కల్చర్‌ను భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శిస్తున్నారు.
దీని పై మంచు లక్ష్మి ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ సినిమాలో మంచు లక్ష్మి , సీనియర్ నరేష్ , కృష్ణుడు , ఆమని , చైతన్య కృష్ణ , రిచా పనాయ్ , కిషోర్ , పృథ్వి, షాలిని , కొండవలస , దువ్వాసి మోహన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల అయ్యాక ఎన్ని వివాదాలకు కారణం అవుతుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more