Aditya chopra rani mukerji secret tie the knot

Aditya Chopra, Rani Mukerji, Aditya Rani, Aditya marries Rani, Rani weds Aditya, Bollywood, Payal Khanna,

After years of speculations, Rani Mukerji and Aditya Chopra got married on April 21, in Italy, in an intimate affair.

రాణీ ముఖర్జీ - ఆదిత్య చోప్రాలు ఒక్కటయ్యారు

Posted: 04/22/2014 01:17 PM IST
Aditya chopra rani mukerji secret tie the knot

బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిం సంస్థ అధినేత, ప్రముఖ దర్శకుడు ఆదిత్య చోప్రా, ప్రముఖ బాలీవుడ్ నటి రాణి ముఖర్జీలు ఇటలీలో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. గత కొంత కాలంగా బాలీవుడ్ లో వీరిద్దరి ప్రేమాయణం గురించి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలకు పుల్ స్టాప్ పెడుతూ వీరిద్దరు మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు.

నిన్న రాత్రి ఇటలీలోని వారి దగ్గరి బంధువుల సమక్షంలో వివాహం జరిగినట్లు యశ్ రాజ్ ఫిలిం సంస్థ ప్రకటించగా, ఈ వివాహం పై రాణి ముఖర్జీ కూడా మీడియాతో మాట్లాడుతూ...‘‘ ఈ రోజు చాలా సంతోషంగా ఉంది... నా జీవితంలో మరచిపోలేని రోజు అని రాణీ ముఖర్జీ అన్నారు. అయితే ఇలాంటి ఆనంద సమయంలో తన మామ యాష్ చోప్రా లేకపోవడం విచారంగా ఉందన్నారు.ఐనా తమకు యష్ అంకుల్ దీవెనలుంటాయని తెలిపింది.

గతంలో అదిత్య చోప్రాకు పాయల్ ఖన్నాతో వివాహం జరిగినా, కొన్ని విభేదాల కారణంగా విడిపోయారు. గత కొద్దికాలంగా తమ మధ్య ఉన్న సంబంధాన్ని రాణీ, ఆదిత్యలు ఎన్ని పుకార్లు వచ్చినా, గోప్యంగా ఉంచారు. రాజ్ కి ఆయేగి బరాత్ తో బాలీవుడ్ లో ప్రవేశించిన రాణి ముఖర్జీ గులాం, కుచ్ కుచ్ హోతా హై, బంటీ ఔర్ బబ్లీ, కభీ అల్విదా నా కెహ్నా చిత్రాల్లో నటించింది. ఇక ఆదిత్య దిల్ వాలే దుల్హానియా లేజాయింగే, మొహబతీస్, రబ్ నే బనాదే జోడీ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles