Sruthi hassan ready police complaint

sruthi hassan, gabbar singh heroine, yavadu movie, sruthi hassan hot photos leak, sruthi hassan ready police complaint, shruti hassan take police action, 2014 yevadu movie release, sruthi hassan mass song hot photos.

sruthi hassan ready police complaint, shruti hassan take police action,

వాడిని వదిలిపెట్టనంటున్న శృతి హాసన్?

Posted: 04/28/2014 10:05 AM IST
Sruthi hassan ready police complaint

గబ్బర్ సింగ్  లవర్ ఇప్పుడు గరం గరం అవుతుంది.   గబ్బర్ సింగ్  పవర్ తో మంచి ఫామ్ లోకి వచ్చిన పిల్లా టాలీవుడ్  తెరపై కేవ్వు కేకలు పెడుతుంది.  అయితే ఈ అందాల భామ శృతి హాసన్ ఈ సంవత్సరంలో  మొట్ట మొదటి హిట్ ‘ఎవడు’. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఆ సినిమాలోని మాస్ నెంబర్ ‘నిన్న చూడకుంటే చాలు...'  సాంగ్ కూడా అంతే హిట్ అయ్యింది. 

ఈ పాటలో శృతి తన గ్లామర్ డోస్ ని పెంచి మరీ స్టెప్పులు వేసింది. ఇటీవలే ఈ పాటలోని కొన్ని హాట్ హాట్ వర్కింగ్ స్టిల్స్ ని మీడియాలోకి వదిలారు. ఈ ఫోటోలు సంచలనం సృష్టించాయి.

బాగా అసభ్యకరంగా ఉన్న ఈ ఫోటోలపై ఎట్టకేలకు శృతి హాసన్ స్పందించింది. ‘పింపుల్ డింపుల్ సాంగ్ షూట్ లో ఉన్నప్పుడు తీసిన వర్కింగ్ స్టిల్స్ అవి, వారిని అసభ్యకరమైన యాంగిల్స్ లో అంతా తీసారు. వాటిని పబ్లిష్ చేయకూడదు. అలా పబ్లిష్ చేయాలి అంటే నాది లేదా ఎవడు మూవీ టీం పర్మిషన్ తీసుకోవాలి. 

అలా తీసుకోకుండా చీప్ పబ్లిసిటీ కోసం ఎవరో వాటిని రిలీజ్ చేసారు. ఈ ఫోటోలు చూసిన చాలా మంది ఎందుకు అలాంటి ఫొటోస్ రిలీజ్ చేసావ్ అని అడుగుతుంటే సమాధానం ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అందుకే ఈ విషయంపై హైదరాబాద్లో కంప్లైంట్ ఫైల్ చేస్తాను. దీనికి కారణమైన ప్రతి ఒక్కరిని బయటకి లాగుతానని’ శృతి తెలిపింది.

అంటే  ఆ సమయంలో  ఆ పాట లొకేషన్లో టాప్ ఏంగిల్ లో తీసిన కొన్ని ఫోటోలలో అమ్మడు మరీ హాట్ గా వుంది.

ఆ ఫోటోలను ఎవరో ఇప్పుడు నెట్లో పెట్టినట్లు తెలుస్తోంది. "మామూలుగా సెట్లో ఫోటోగ్రాఫర్లు రకరకాల ఫోటోలు తీస్తుంటారు. వాటిలో వల్గర్ అనిపించే ఫోటోలను బయటకురానీయరు. మరి ఈ ఫోటోలు ఎలా వచ్చాయో నాకు తెలియడం లేదు.  అందుకే, ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటున్నాను. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను. అసలీ ఫోటోలు ఎవరి ద్వారా లీకయ్యాయో నేను కచ్చితంగా తెలుసుకుంటాను" అంటోంది శృతి.

 ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles