Dasari narayana rao son re entry malayalam neram remake film

dasari narayana rao, Arun Kumar, neram movie, dasari narayana rao son re entry, malayalam neram remake film,

dasari narayana rao son re entry malayalam neram remake film

దాసరి గారి అబ్బాయి చేస్తున్న ‘నేరం’?

Posted: 04/27/2014 09:00 AM IST
Dasari narayana rao son re entry malayalam neram remake film

టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు గారి అబ్బాయి ‘నేరం’ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే నిజాంగా కాదులేండి. ఇప్పుడు నేరం చేయటానికి  దాసరి గారి అబ్బాయి  ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. అదేంటో కానీ అండీ ఏ ఇండస్ట్రీలో అయినా వారసత్వం సహజమే అయినా తెలుగు సినిమా పరిశ్రమలో మాత్రం హీరోల వారసులు మాత్రమే సక్సెస్ అవుతారు కానీ దర్శక, నిర్మాతల పిల్లలు మాత్రం సక్సెస్ అయిన దాఖలాలు చాలా తక్కువ. అది కూడా సక్సెస్ అయ్యారంటే అది కూడా తమ సొంత కష్టం తప్పితే.. వారసత్వం వచ్చిన క్రేజ్ ను ఉపయోగించి కాదు. దీనికి ఉదాహారణలు చాలానే ఉన్నాయి.

ఉదాహరణగా దర్శకుడు కోదండరామిరెడ్డిని తీసుకుంటే.. తెలుగు సినిమాలో ఆయనో రెబల్. చేసిన ప్రతి సినిమాకు హీరో ఇమేజ్ అమాంతం పెరిగిపోయేది. కానీ ఆయన కుమారుడు వైభవ్ ను మాత్రం టాలీవుడ్ లో నిలపలేకపోయాడు. ఇక మరో దర్శక, నిర్మాత ఎంఎస్ రాజు. ఈయన సినిమాలతో లవర్ బాయ్లుగానే కాక అమ్మాయిల హీరోలు కూడా అయ్యారు. కానీ తన కొడుకు సుమంత్ అశ్విన్ కు మాత్రం హిట్టు ఇవ్వలేకపోయాడు.

ఇక ఆఖరికి తెలుగు పరిశ్రమలోనే ప్రస్తుతం గురువుగా.. దాదాపు సినిమాకు సంబంధించిన అన్ని శాఖలలో నైపుణ్యం గల వ్యక్తిగా అనుభవం ఉన్న దాసరి నారాయణరావు కూడా ఆయన కుమారుడికి ఓ హిట్టు ఇవ్వలేకపోతున్నాడు.

గ్రీకువీరుడు సినిమాతో వచ్చిన అరుణ్ కుమార్ హీరోగా సక్సెస్ కాలేక కొన్ని సినిమాలలో ముఖ్యపాత్రలకు కూడా షిఫ్ట్ అయ్యాడు. అయితే గత నాలుగేళ్లగా కెమెరా ముందుకురాలేదు. అయితే ఇప్పుడు నేరం అనే మ‌ల‌యాళ రీమేక్ సినిమాతో మళ్ళీ సెకండ్ ఇన్నిగ్స్ ప్రారంభిస్తున్నాడు. మరి ఈ ఇన్నింగ్స్ అయినా సక్సెస్ అవుతుందో లేక మరో ఇన్నింగ్స్ కావాలో చూడాలి!

 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles