Doosukeltha show off screen from maa tv

Doosukeltha show off screen, manchu laxmi prasanna, nagarjuna, amala, maatv, Meelo Evaru Koteeswarudu

Manchu Lakshmi show Doosukeltha is going off screen from MAA TV to accommodate King Nagarjuna Meelo Evaru Koteeswarudu.

మంచు లక్ష్మి దూకుడుకి బ్రేకులు వేసిన నాగ్

Posted: 06/06/2014 07:08 PM IST
Doosukeltha show off screen from maa tv

టాలీవుడ్ డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు అయిన మంచు లక్ష్మి ప్రసన్న లక్ష్మి టాక్ షో ద్వారా బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చి, తన హస్కీ వాయిస్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకొని సదరు ఛానల్ కి మంచి టీఆర్పీ రేటింగులు తెచ్చి పెట్టింది.  ఆ తరువాత ‘ప్రేమతో మీ లక్ష్మీ ’  అంటూ పలకరించింది. ఇప్పుడు మా టీవీలో ‘దూసుకెళ్తా ’ అనే ప్రోగ్రాంకి హోస్ట్ గా చేస్తుంది. ప్రస్తుతం జనాల్ని బాగానే ఆకట్టుకుంటున్న ఈ షోని ఇక పై నిలిపివేయనున్నారు.

మంచి ఆదరణ కలిగిన ఈ షోను ఉన్నట్లుండి ప్రక్కన పెట్టడానికి కారణం నాగార్జునే అని తెలుస్తుంది. నాగార్జున రియాలిటీ షో... మీలో కోటీశ్వరుడు ఎవరు పోగ్రామ్ రానుండటంతో ఈ షో కు స్వస్తి చెప్పేసారని తెలుస్తోంది. ఈ షో ప్లేస్ లో నాగార్జున షో ప్రసారం కాబోతుంది అన్నమాట. జూన్ మొదటివారం నుంచి ‘మా' టీవీలో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.

హిందీతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, భోజ్‌పురి భాషల్లో ఇప్పటికే ఈ షో విజయ వంతం కావడంతో దీన్ని తెలుగులో నాగార్జునతో చేయిస్తున్నారు. ఈ టీవీలో వేరే ప్రోగ్రాం ప్లేస్ లో దీన్ని ప్రసారం చేయాలని చూసినా, మంచు లక్ష్మి ఉంటే నాగార్జున షోకు ఆదరణ తగ్గుతుందనే ఉద్దేశ్యంతో దీన్ని ప్రక్కన బెట్టారని తెలుస్తుంది.

 

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles