సౌత్ సినిమా ఇండస్ట్రీలో మూడు పదులు దాటినా ఇంకా పెళ్ళి పీఠలు ఎక్కని హీరో, హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ఇప్పటికీ బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న వారిలో టాలీవుడ్ బొమ్మాళి ఒకరు. అనేనండీ అనుష్క. ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు అయినా ఇప్పుటికీ అవకాశాల పరంగా ఓ మాత్రం పట్టుజారకుండా, అందాలు కరిగిపోకుండా బడా ప్రాజెక్టులు చేస్తున్న అనుష్కకు ఇక పెళ్ళి చేసి తన బాధ్యత తీర్చేసుకోవాలని అనుకంటున్నారట ఆమె తల్లిదండ్రులు.
అందుకోసం ఆమెకు ఈడు, జోడు కలిసే వరుడ్ని ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నారట. చాలా రోజుల నుండి సంబంధాలు చూస్తున్న ఆమెకు ఇంకా తగిన వరుడు మాత్రం దొరకలేదట. ఇటీవలే చాలా సంబంధాలు చూసిన వాళ్ళు ముగ్గుర్ని ఎంపిక చేసి పెట్టారట. వారిలో ఒకరు బడా వ్యాపార వేత్త కాగా, మరొకరు ఇంజనీర్, ఇంకొకరు సినిమా దర్శకుడు అని సమాచారం.
వీరికి సంబంధించిన డిటేల్స్ అనుష్క ముందు ఉంచితే వారిలో ఎవర్ని సెలక్ట్ చేసుకుంటే అతనితోనే అనుష్క పెళ్లి. ప్రస్తుతం తెలుగులో చారిత్రాత్మక కథా చిత్రాలు రుద్రమదేవి, బాహుబలి చేస్తున్నారు.అలాగే తమిళంలో సూపర్ స్టార్‌తో తొలిసారిగా లింగా చిత్రంలో జోడీ కడుతున్నారు. అజిత్ సరసన మరో భారీ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఈ చిత్రాలు పూర్తవ్వడానికి కనీసం సంవత్సరం అయినా పడుతుంది. అంటే అనుష్క పెళ్ళి వచ్చే ఏడాదిలో ఉంటుందని అనుకోవచ్చు. అయితే సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అనుష్క సినీ దర్శకుడికే ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే ఈ అమ్మడు దర్శకుడు క్రిష్ తో ప్రేమాయణం నడుపుతుందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. సినీ జనాలు అనుకుంటున్నట్లు సినీ దర్శకుడిని సెలక్ట్ చేసుకుంటుందా ? లేక మరెవర్నయినా చేసుకుంటుందా ? వెయిట్ అండ్ సీ....
Knr
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more