Ss rajamouli re shoots baahubali scenes

Director SS Rajamouli, SS Rajamouli Re-Shoots, Telugu movie Baahubali, Baahubali Scenes Re-Shoots

SS Rajamouli has resumed the shooting of his magnum opus Baahubali.

జక్కన్న వాటిని మళ్ళీ చెక్కుతున్నాడు....

Posted: 06/09/2014 07:25 PM IST
Ss rajamouli re shoots baahubali scenes

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘బాహుబలి ’ సినిమా  యూనిట్ గత నెల రోజుల నుండి విరామం తీసుకున్న విషయం తెలిసిందే. చాలా రోజుల తరువాత ఈ సినిమా షూటింగును నిన్న రాజమౌళి ప్రారంభించాడు. ఈ షెడ్యూల్లో గతంలో షూట్ చేసిన కొన్ని సన్నివేశాలను మరళ చిత్రీకరిస్తున్నారట.

గతంలో తీసిన సీన్స్‌లో కొన్ని సీన్స్ వాతావరణం కారణంగా సరిగా రాకపోవడంతో దానికి సంబంధంచిన సెట్స్ ను వేసి ఇప్పుడు వాటిని చిత్రీరిస్తున్నారట. ప్రతి సన్నివేశాన్ని తనకు నచ్చే వరకు తీసే రాజమౌళి ఎంత శ్రమైనా లెక్క చేయడు. గతంలో తీసిన సన్నివేశాల్నే మళ్లీ తీయడం ఈయనకు రిస్కే అయినా ఆయన ఎక్కడ రాజీపడడు.

రీ షూట్ చేసే సీన్స్ కోసం మళ్ళీ భారీ సెట్‌ని వేశాం. ఈ సారి వాతావరణం మాకు అనుకూలిస్తుందని ఆశిస్తున్నామని, ఇన్నాళ్ళ తరువాతనైనా ఆ సీన్స్ ను చిత్రీకరించడం చాలా రిలీఫ్ గా ఉందని, తన సినిమా కోసం యూనిట్  సభ్యులు చాలా కష్టపడటం ఎంతో త్రుప్తినిస్తుందని, వారందరికి నా ధన్యవాదాలు అని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles