Jayasudha high remuneration for ram charan film

ayasudha high Remuneration , Jayasudha Shocking Remuneration, Jayasudha Remuneration for Ram Charan Film, Jayasudha Remuneration for Govindudu Andhari Vadele, Actress Jayasudha

Actress-turned-Politican Jayasudha has been roped to play Prakash Raj partner in Govindudu Andari Vaadele. she is demand high remuneration.

షాక్ : ఆంటీ భారీగా పెంచింది

Posted: 06/10/2014 10:22 AM IST
Jayasudha high remuneration for ram charan film

ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓడిపోయిన సినీనటి జయసుధ మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతుంది. ఈమె ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సినిమా ‘గోవిందుడు అందరి వాడేలే ’ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇందుకోసం ఆమె భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం. సాధారణంగా ఓ పాత్రకు 10 నుండి 15 లక్షలు తీసుకునే జయసుధ ఈ సినిమాలో దానికి డబుల్ అంటే దాదాపు 30 లక్షలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈమె ఇంత డిమాండ్ చేసినా నిర్మాత ఇవ్వడానికి కూడా వెనకాడటం లేదట. ఎందుకంటే మొదట ఇచ్చిన డేట్స్ ప్రకారం జయసుధ తన షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకుంది. కానీ ఇటీవల ఆ చిత్ర కథలో చిరంజీవి జోక్యం కేసుకొని కొన్ని చేర్పులు మార్పులు చేయడమే కాకుండా, జయసుధ, రాజ్ కిరణ్ ల పై చిత్రీకరించిన సీన్లను తీసివేసి, ప్రకాష్ రాజ్ ని రాజ్ కిరణ్ స్థానంలో తీసుకొని ప్రకాష్ రాజ్ , జయసుధ ల పై సన్నివేశాలను మళ్ళీ చిత్రీకరిస్తున్నారట.

ఇందుకు డేట్లు సర్ధుబాటు చేసినందుకు జయసుధ ఇంత డిమాండ్ చేస్తుందని అంటున్నారు. చిరంజీవి కథలో జోక్యం చేసుకోవడం వలన నిర్మాతకు దాదాపు 5 కోట్ల మేర నష్టం వాటిల్లితే దానిని రామ్ చరణ్ భరించాడని, తండ్రి మాటకంటే డబ్బులు ఎక్కువ కావని ఇటు నిర్మాత కూడా నష్టపోకుండా చూశాడని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. కొన్ని రోజుల విరామం తరువాత ఈ సినిమా షూటింగ్ మళ్ళీ ప్రారంభం అయింది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles