Pawan kalyan is my brother says vivek oberoi

pawan kalyan is my brother says Vivek Oberoi, Pawan anna is my elder brother, actor vivek oberoi,bollywood news, hero Vevek Oberai called pawan Kalyan Anna

pawan kalyan is my brother says Vivek Oberoi, Pawan anna is my elder brother, actor vivek oberoi,bollywood news, hero Vevek Oberai called pawan Kalyan Anna

పవన్ పై పరిటాల రవి కపట ప్రేమ

Posted: 06/12/2014 01:37 PM IST
Pawan kalyan is my brother says vivek oberoi

అనంతపురం రాజకీయ నేత పరిటాల రవికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎక్కడో వైరం ఉండేదని చాలా మందికి అంటున్నారు. ఏదో ఫ్యాక్షన్ గొడవల్లో పరిటాల రవి హత్యకు గురైన తరువాత దీని పై పెద్దగా ఎవరూ మాట్లాడుకున్నది లేదు. కానీ ఉన్నట్లు ఉండి పరిటాల రవికి పవన్ కళ్యాణ్ కి ప్రేమ పుట్టుకొచ్చింది. ఆయన నాకు పెద్దన్నయ్య లాంటి వాడు అంటున్నాడు. ఏంటి ఈ కన్ ఫ్యూజన్ ఏదో తొందరగా చెప్పొచ్చుగా ?

విషయంలోకి వస్తే... రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రక్త చరిత్ర ’ సినిమా అనంతపురం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తీసి సంచలం స్రుష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పరిటాల రవి పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటించాడు. ఈయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై ఎనలేని ప్రేమను కురిస్తున్నాడు. ఇటీవలే మోడీ ప్రమాణ స్వీకార సభలో,  చంద్రబాబు ప్రమాణ స్వీకార సభలో కనపడి అందర్ని ఆశ్చర్య పరిచాడు.

చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ప్రక్కనే కూర్చొని చాలా సేపు ముచ్చటించాడు కూడా.  దీని గురించి వివేక్ చెబుతూ, ‘పవన్ నాకు అన్నయ్య లాంటివాడు. ఐదారేళ్ళ క్రితం కలిసినప్పుడు నేను అతని సినిమాలకు అభిమానిని. ఇప్పడు ఆయనంటే పిచ్చి. పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేయాలనే తపన నాకు బాగా నచ్చింది. త్వరలో నేను ముంబయిలో స్థాపించబోయే బ్లడ్ బ్యాంకుకి అతని సలహాలు, సహాకారాలు తీసుకుంటాను.  ఈ విషయం తనతో చెబితే, ఎంతగానో ప్రోత్సహించడమే కాకుండా సలహాలు కూడా ఇస్తానన్నాడని చెప్పుకొచ్చాడు.

పిలవని పేరంటానికి వచ్చి... పవన్ పై ఇలా ప్రశంసల జల్లు కురిపించడం వెనక పెద్ద స్కెచ్ ఉందని అంటున్నారు. అదీ సంగతి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles