Krishnam raju father role in rudramadevi

Krishnam raju father role in Rudramadevi, Krishnam Raju anushka Father, Historical 3D Film, Allu Arjun as Gona Ganna Reddy, Rebel Star Krishnam Raju, Krishnam Raju Ganapathideva role

Krishnam raju father role in Rudramadevi, Krishnam Raju anushka Father, Historical 3D Film, Allu Arjun as Gona Ganna Reddy, Rebel Star Krishnam Raju, Krishnam Raju Ganapathideva role

అనుష్కకు తండ్రిగా క్రిష్ణం రాజు

Posted: 06/12/2014 12:06 PM IST
Krishnam raju father role in rudramadevi

టాలీవుడ్ లో వచ్చిన గాసిప్స్ ప్రకారం ప్రభాస్ అనుష్క పెళ్ళి చేసుకుంటే ప్రభాస్ పెద్దనాన్న రెబల్ స్టార్ క్రిష్ణం రాజు అనుష్కకు మామయ్య అయ్యేవాడు. ఆ సంగతి ప్రక్కన పడితే ఇఫ్పుడు అనుష్క క్రిష్ణం రాజులు కలిసి నటిస్తున్నారు. క్రిష్ణం రాజు ప్రభాస్ తో తీసే సినిమాలోనో, రాజమౌళి ‘బాహుబలి ’లోనో కాదు... దర్శకుడు గుణ శేఖర్ అంత్యంత ప్రతిష్టాత్మకంగా అనుష్కను ప్రధాన పాత్రలో పెట్టి హిస్టారికల్ చిత్రంగా తెరకెక్కిస్తున్న ‘రుద్రమదేవి ’ సినిమాలో క్రిష్ణం రాజు అనుష్కకు తండ్రిగా కనిపించబోతున్నాడు.

ఇప్పటికే ఇందులో భారీ తారాగణం రాణా, అల్లు అర్జున్, అనుష్క, నిత్యా మీనన్, బాబా సెహగల్ లాంటి వారు నటిస్తున్నారు. కథా పరంగా చాలా పాత్రలు ఉండటంతో గుణశేఖర్ ఆ పాత్రలకు సరిపోయే వారిని తీసుకుంటున్నారు. ఇటీవలే గోన గన్నారెడ్డి పాత్రకు అల్లు అర్జున్ ని తీసుకొని ఆయనకు సంబంధంచిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గోన గన్నారెడ్డి పాత్ర షూటింగ్ పూర్తి అయితే దాదాపు ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లే.

రుద్రమదేవి పాత్రలో అనుష్క నటిస్తుండగా, గణపతి దేవుడి పాత్రాలో క్రిష్ణం రాజు కనిపిస్తాడట. అంటే అనుష్కకు తండ్రిగా కనిపించబోతున్నాడన్న మాట. కాకతీయుల కాలంలో గణపతి దేవుడి పాత్రను క్రిష్ణం రాజు చాలా పవర్ ఫుల్ గా పోషించాడని చిత్ర యూనిట్ వర్గాల సమాచారం. త్రీడీ టెక్నాలజీలో తెరకెక్కుతన్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles