Anushka is playing prabhas mom role

Anushka playing mom role, Anushka as Prabhas mother in Baahubali, anushka,anushka as prabhas mother in baahubali,anushka in baahubali,prabhas,prabhas dual role,anushka dual role in baahubali,anushka playing prabhas mother role in baahubali

Young Rebel star Prabhas and Anushka starrer movie Baahubali under Rajamouli direction.

అనుష్క తల్లి కాబోతుంది....

Posted: 06/18/2014 07:51 PM IST
Anushka is playing prabhas mom role

ఇటీవలి కాలంలో చాలా మంది హీరోయిన్లు పెళ్ళిళ్ళు చేసుకొని గర్భం దాల్చి పండంటి పాపలకు జన్మనిస్తుంటే... అనుష్క పెళ్లి కాకుండానే తల్లి కాబోతుందా ? అనే ప్రశ్నను మదిలోకి రానీయకండి. సౌత్ ఇండియా సినిమాల్లో అనుష్క విలక్షణమైన పాత్రలు పోషించడానికి ఎప్పుడు ముందుండే హీరోయిన్ గా అనుష్కకు పేరుంది. ఇఫ్పటికే వేశ్యగా, జేజమ్మగా కనిపించిన ఈమె ‘రాణి రుద్రమ ’ సినిమాలో రాణిగా పోరాటయోధురాలి పాత్ర కూడా పోషిస్తుంది. ఇప్పుడు ప్రభాస్ కి అమ్మగా కూడా నటించబోతుంది.

అనుష్క ప్రభాస్ జంటగా రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఒక ప్రభాస్ కి తల్లి పాత్రలో కనిపించబోతుందట. ఈ సినిమా ప్లాష్ బ్యాక్ లో ప్రభాస్ - అనుష్క పోషించే పాత్రలు సినిమాకే హైటెల్ గా నిలుస్తాయని చిత్ర యూనిట్ వర్గాల సమాచారం. ఇక ఈ సినిమాకు కమీట్ అయినప్పటి నుండే ఇందులోని పాత్ర కోసం అనుష్క కత్తి యుద్దాలు, హార్స్ రైడింగ్ విద్యల్లో శిక్షణ పొందింది.

ప్రభాస్ భుజానికి సర్జరీ కారణంగా మొన్నటి వరకు సమ్మర్ బ్రేక్ తీసుకున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మళ్ళీ ప్రారంభం అయింది. సినిమా యూనిట్ కి విరామం ఇచ్చినా, ఆయన మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో, కీరవాణి పాటల రీ రికార్డింగ్ వర్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా లో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యక్రిష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, కీరణవాణి సంగీతం అందిస్తున్నారు. సింథిల్ కుమార్ సినిమాటో గ్రఫి అందిస్తున్నాడు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఆర్కా మీడియా పథాకం పై నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపందుతున్న ఈ సినిమా 2015లో విడుదల కాబోతుంది.

knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles