Actress anjali turned as hyderabad party girl

actress anjali turned as hyderabad party girl, actress anjali, telugu actress anjali, actress anjali latest news, actress anjali attend party in hyderabad, actress anjali gave party in hyderabad, actress anjali hyderabad party photos, actress anjali hot photo shoot

actress anjali turned as hyderabad party girl

సీతమ్మ సిగ్గు వదిలి.. పార్టీ గాళ్ గా మారింది!

Posted: 06/26/2014 10:21 AM IST
Actress anjali turned as hyderabad party girl

(Image source from: actress anjali turned as hyderabad party girl)

టాలీవుడ్ సీతగా మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ అంజలి... ఈమధ్య కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. గతంలో డైరెక్టర్ కళంజియం మానసికంగా వేధిస్తున్నాడని, పిన్ని భారతి ఆస్తికోసం ఇబ్బందులు పెడుతోందని టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిపోయింది. కొన్నాళ్ల తరువాత ఆ సమస్యలన్ని ఒక పట్టాన చేరుకున్నాయి.

మొన్నటికి మొన్న డైరెక్టర్ కళంజియం మళ్లీ అంజలి మీద తమిళ ప్రొడ్యూసర్ అసోసియేషన్ వారికి... ‘‘తన సినిమా పూర్తికాకుండానే మరో సినిమా చేయడానికి ఒప్పుకుందని... తన సినిమా పూర్తి చేసిన తరువాతే వేరే సినిమాల్లో నటించాలని.. అలా కాని పక్షంలో నష్టపరిహారం చెల్లించాల్సిందిగా’’ అంటూ కంప్లైంట్ చేశాడు.

ఈ విషయం మీద ఇంకా పూర్తిగా క్లారిటీ రాకముందే అంజలి మరోసారి వార్తల్లోకి ఎక్కేసింది. ప్రతి సినిమాలో చీరకట్టులో అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించే అంజలి... ఈసారి పార్టీ గాళ్ గా అవతారమెత్తింది. హైదరాబాద్ లోనే వుంటోందని సమాచారం వెలువడిన నేపథ్యంలో... ఇలా ఈ విధంగా దర్శనం ఇచ్చి అందరినీ షాక్ కి గురి చేస్తుంది. చాలావరకు ఆమెను ఆ గెటప్ లో చూసి ‘‘ఈమె ఇంతకు అంజలీయేనా’’ అంటూ నోళ్ళవెళ్లు బెట్టుకున్నారట!

ప్రస్తుతం ‘‘గీతాంజలి’’ అనే కామెడీ, హారర్ సినిమాలోనే నటిస్తున్న ఈ భామ... రీసెంట్ ఈ పార్టీకి అటెండ్ అందరినీ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఎప్పుడూ చీరకట్టులో కనిపించే అంజలి... హైదరాబాద్ హాట్ పార్టీ గాళ్ గా కనిపించింది. పార్టీలో వచ్చిన వారందరు డ్రింకులు తాగి చిందులేస్తుంటే... అంజలి కూడా వారితో కలిసి డ్యాన్సులు చేసిందట. అందుకు సంబంధించి.. అందరితో తాను కలిసి సందడి చేసిన ఫోటోలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లలో హల్ చల్ చేస్తున్నాయి. ఒక ప్రముఖ నిర్మాత ఏర్పాటు చేసిన ఈ పార్టీలో హరీష్ శంకర్, ధశరథ్, కోన వెంకట్, వీరుపోట్ల, నాని, విక్రమ్ కుమార్, ఇంకా తదితర యూనిట్ సభ్యులు అటెంట్ అయినట్టు సమాచారం!

ఈ ఫోటోలను వీక్షించిన ప్రతిఒక్కరు... ‘‘కోర్టు గొడవల వ్యవహారాలన్నింటిని పక్కనబెట్టి ఇలా చిందులు వేయడం ఆమె కెరీర్ కి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది’’ అని అంటే.. మరికొందరు సినిమా అవకాశాలు కరువు కావడంతో.. తిరిగి తన ఇమేజిన్ పెంచుకోవడం కోసం ఇలాంటి ట్రిక్కులు ప్లే చేస్తోందని గుసగుసలాడుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles