‘‘నేను ట్రెండ్ ను ఫాలో అవ్వను... ట్రెండ్ సెట్ చేస్తా’’నంటూ టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ రికార్డులు సృష్టిస్తున్న విషయం అందిరికి తెలిసిందే! తొలిప్రేమ సినిమాతో లవర్ బాయ్ గా పేరుతెచ్చుకున్న పవన్... ఆ తరువాత నటించిన బద్రి సినిమాతో యాక్షన్ అండ్ ఎంటర్ టైనర్ హీరోగా తనదైన ట్రెండ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ‘‘నాక్కొంచెం తిక్కుంది... దానికో లెక్కుంది’’ అని తన తిక్క గురించి చెప్పుకున్న ఈ పవర్ స్టార్... ‘‘అత్తారింటికి దారేది’’ సినిమాతో టాలీవుడ్ లో వున్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేశాడు. తెలుగు హీరోలలో ఎవరికీ లేనంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ ని తన సొంతం చేసుకున్నాడు.
అంతటి ఇమేజ్ వున్న ఈ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్ గా నటించడానికి అవకాశం వస్తే... ఎంతటి స్టార్ యాక్ట్రెస్ అయినా అంత సులువుగా వదులుకోరు. అంతెందుకు... ఆయన పక్కన కనీసం ఒక ఫోటో దిగిన చాలు.. మా జీవితమే ధన్యమయిపోతుందని ఎంతోమంది అభినయ తారలు కూడా చెబుతుంటారు. ఇప్పుడు తాజాగా ఒక పంజాబీ అమ్మాయి పవన్ కల్యాణ్ వెంటపడుతోంది. తనతో కలిసి సినిమాల్లో నటించే ఛాన్స్ ఇవ్వాలని పవర్ స్టార్ ను వేడుకుంటోంది. చేతికి అందివచ్చిన అవకాశాన్ని వదులుకుని... ఇప్పుడు బతిమిలాడుకుంటోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వెనకాల పడుతున్న ఆ పంజాబీ అమ్మాయి ఎవరో కాదు... టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్. మగధీర సినిమాతో మలుపు తిరిగిన కాజల్ కెరీర్... అమాంతంగా సినిమాలు చేసుకుంటూ ఒక ఊపు ఊపేసింది. ఎంతమంది హీరోయిన్లు టాలీవుడ్ కి వచ్చినా... ఈమె ధాటికి నిలవలేకపోయారు. ఈమెకున్న క్రేజ్ ను చూసి బాలీవుడ్, కోలీవుడ్ దర్శకనిర్మాతలు కూడా ఈమె డేట్స్ కోసం క్యూలో నిలబడేవారు. ఈ విషయాన్ని క్యాచ్ చేసిన ఈ అమ్మడు తన రెమ్యునరేషన్ ని అమాంతంగా పెంచేసి, టాలీవుడ్ కు ముఖం చాటేసింది.
తమ సినిమాల్లో నటించాల్సిందిగా తెలుగు దర్శక, నిర్మాతలు ఎంతగా రిక్వెస్ట్ చేసినా.... నేరుగా సినిమాలు చేయనని చెప్పకుండా, భారీ పారితోషికం కావాలని డిమాండ్ చేస్తూ తప్పుకుంది. అలాగే గతంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేయమని అడిగితే.. అప్పుడు కూడా భారీగా డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో యూనిట్ సభ్యులతో సహా పవన్ కూడా షాక్ అయ్యారని వార్తలు వచ్చాయి. దీంతో ఆ సినిమాలో మరో హీరోయిన్ ను తీసుకోవాల్సి వచ్చింది.
ఈమె ఈ విధంగా భారీ పారితోషికం డిమాండ్ చేయడంతో తెలుగు నిర్మాతలు ఈమెను పట్టించుకోవడం మానేశారు. దీంతో ఈ అమ్మడికి తెలుగు సినిమా అవకాశాలు రాకపోవడంతో కొన్నాళ్లవరకు టాలీవుడ్ కు కనుమరుగయ్యింది. తరువాత కాలక్రమంలో బాలీవుడ్ లో ఈమెకు అవకాశాలు లభించలేదు. ఈమె నటించిన రెండు బాలీవుడ్ సినిమాలు హిట్ అయినా... యాక్టింగ్ లో అంతగా రాణించడంలేదని విమర్శలను కని తెచ్చుకుంది. దీంతో ఈమె బాలీవుడ్ దశ కూడా తిరగబడిపోయింది. ఏం చేయాలోనని తోచని పరిస్థితిలో పడిపోయిన ఈమె... తిరిగి టాలీవుడ్ చెంతకే చేరింది.
టాలీవుడ్ కు కనుమరుగైన భామ మళ్లీ తిరిగొస్తోందన్న వార్త వినగానే.. మన తెలుగు దర్శకనిర్మాతలు ఈమెకు మళ్లీ సినిమాల్లో నటించే అవకాశం కల్పించారు. అందులో భాగంగానే ఇప్పుడు రామ్ చరణ్ సరసన గోవిందుడు అందరివాడేలే, ఎన్టీఆర్ సరసన రభస సినిమాల్లో నటిస్తోంది. ఇంతటితో తృప్తిపడక... ఇప్పుడు తాజాగా పవన్ కల్యాణ్ సరసన నటించాలని వుందని తన మనసులోని మాటలను బయట పెట్టింది. పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్ గా నటించేందుకు అవకాశాన్ని తన చేతులారా మిస్ చేసుకున్న ఈ భామ... ఇప్పుడు తిరిగి అతనితో కలిసి నటించే ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోందని సినీజనాలు గుసగుసలాడుకుంటున్నారు.
ఈ వార్తలు విన్న సదరు విశ్లేషకులు.. ఈమె మీద అప్పుడే ఘాటు కామెంట్లు చేసేస్తున్నారు. టాలీవుడ్ పరిశ్రమకు కొన్నాళ్లు దూరమై, తన ఇమేజీని డ్యామేజ్ చేసుకున్న ఈ భామ... తిరిగి స్టార్ డమ్ ను సంపాదించడానికే ఇలా పవన్ కల్యాణ్ సరసన నటించాలంటూ కామెంట్లు చేస్తోందని ఆరోపణలు చేస్తున్నారు. అలాగే గతంలో పవన్ కల్యాణ్ కు షాక్ ఇచ్చిన కాజల్ కు... ఏం సమాధానం ఇస్తాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని టాక్!
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more