(Image source from: Sruthi hassan special song in agadu movie with mahesh babu)
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘‘ఆగడు’’! ఇందులో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా తమన్నా నటిస్తోంది. ఈ సినిమాలో శృతిహాసన్ ఒక ప్రత్యేక గీతంలో నటించనుందని అందరికీ తెలిసిన విషయమే! ఈ పాట షూటింగ్ జూలై 18వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. 4 నిముషాల వరకు నిడివి వుండే ఈ పాట... ప్రేక్షకజనాలను బాగా నచ్చుతుందని, సినిమాకు ప్రత్యేకంగా క్రేజ్ తెస్తుందని భావిస్తున్నారు.
తాజాగా ఈ పాటకోసం శృతిహాసన్ బికినీ ధరించుకుందని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబులాంటి స్టార్ హీరోతో మొదటిసారి స్టెప్పులు వేసే అవకాశం రావడంతో శృతి ఇలా శృతిమించేవిధంగా డ్రెస్సులు ధరిస్తోందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈమె కాస్ట్యూమ్స్ చాలావరకు కురుచుగా డిజైన్ చేసి వున్నాయని, దాదాపు అవి బికినీలా కనువిందు చేస్తాయని చెప్పుకుంటున్నారు. దీంతో శృతిహాసన్ బికినీలో దర్శనమీయబోతోందని వార్తలు ఫిల్మ్ ఇండస్ట్రీలో షికార్లు చేస్తున్నాయి.
ఇప్పటికే ఈ ప్రత్యేక పాట చాలా బాగా వచ్చిందంటూ దర్శకుడు శ్రీనువైట్ల, మ్యూజిక్ డైరెక్టర్ తమ ట్విటర్ ద్వారా అందరికి చెప్పుకున్నారు. ఈ సాంగ్ చిత్రీకరణ పూర్తవగానే చిత్ర యూనిట్ నార్వేకి షిఫ్ట్ అవుతుందని, అక్కడ మహేష్ - తమన్నాల మధ్య రెండు పాటలను తెరకెక్కిస్తారని దర్శకనిర్మాతలు పేర్కొంటున్నారు. ఆగస్టు రెండవ వారంలో ఈ సినిమా పాటలు విడుదల చేస్తున్నట్టు చెప్పిన నిర్మాతలు... సెప్టెంబర్ 19వ తేదీన చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు స్పష్టం చేశారు.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more