Producer santosh kumar suicide with his wife and daughter

Mollywood producer santosh kumar suicide with his wife and daughter in dubai, mollywood producer santosh kumar, producer santosh kumar suicide case, producer santosh kumar suicide with his wife and daughter in dubai, producer santosh kumar suicide case news, producer santosh kumar with her wife manju and daughter gowri, producer santosh kumar death

Mollywood producer santosh kumar suicide with his wife and daughter in dubai

అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్న నిర్మాత

Posted: 07/18/2014 02:54 PM IST
Producer santosh kumar suicide with his wife and daughter

మాలీవుడ్ నిర్మాత సంతోష్ కుమార్ తన కుటుంబంతోపాటు దుబాయ్ లో ఆత్మహత్య చేసుకోవడం పెద్ద దుమారంగా మారిపోయింది. ‘‘సౌపర్ణిక’’ అనే ఫిలిం నిర్మాణ సంస్థను నిర్వహించిన సంతోష్ కుమార్... మడాంబి వంటి హిట్ సినిమాని నిర్మించాడు. ఒక మెయింటెన్స్ కంపెనీని కూడా సొంతం చేసుకున్నాడు. వీరు ఆత్మహత్యలు చేసుకోవడానికి బలమైన కారణాలు ఏమున్నాయంటూ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదట హత్య జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు చివరికి వీరందరూ ఆత్మహత్య చేసుకున్నారని నిర్థారించారు. కేరళకు చెందిన ఈ నిర్మాత భారీమొత్తంలో అప్పులు చేసి, వాటిని తీర్చుకోలేక ఇలా సూసైడ్ చేసుకుని వుంటాడని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

సంతోష్ కుమార్ ఐదేళ్ల క్రితం తన భార్య మంజు, కుమార్తె గౌరితో కలిసి దుబాయ్ కి షిఫ్ట్ అయ్యాడు. అక్కడే ఒక మెయింటెనెన్స్ కంపెనీలో పార్ట్ నర్ గా కొనసాగాడు. అంతవరకూ అందరితో సన్నిహితంగానే వున్న వీరు.. అనుకోకుండా వారుంటున్న అపార్ట్ మెంట్ లోనే ఇలా మృతదేహాలుగా మారిపోయారు. సంతోష్, భార్య మంజు, కుమార్తె గౌరి మృతదేహాలపై ఎన్నో కత్తిపోట్లు వున్నాయని అతని కుటుంబసభ్యులు పేర్కొంటున్నప్పటికీ... దుబాయ్ పోలీసులు మాత్రం అన్నివిధాలుగా పరీక్షించిన తరువాత సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు.

పోలీస్ దర్యాప్తులో భాగంగా సంతోష్ కుమార్ అప్పుల బాధలవల్లే తన కుటుంబంతోపాటు ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఒక ఆఫీసర్ చెబుతూ... ‘‘సంతోష్ కుమార్ కు దుబాయ్, అబు ధాబిలో ఎన్నో బౌన్స్ చెక్ లకు సంబంధించి కేసులు వున్నాయని’’ స్పష్టం చేశారు. వీరి మరణవార్త వినగానే స్నేహితులు, కుటుంబసభ్యులు తీవ్రంగా ఆవేదనకు గురయ్యారు. దర్యాప్తు పూర్తయిన వెంటనే వీరి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగిస్తామని ఆయన అన్నారు.

ఈ దర్యాప్తు నేపథ్యంలో కుమార్ బంధువు ఒకరు తమ మధ్య వున్న సాన్నిహిత్యం గురించి వివరించాడు. తన భార్య, కుమార్ భార్య ఎల్లప్పుడూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లలో మాట్లాడుకుంటారని, ఫోటోలు పోస్ట్ చేసుకుంటూ కామెంట్లు చేసుకుంటుంటారని ఆయన తెలిపాడు. కుమార్ భార్య మంజూ అయితే ఎల్లప్పుడూ ఫేస్ బుక్ లో ఫోటోలను పోస్ట్ చేసేదని, షాప్ లేదా రెస్టారెంట్ కి వెళ్లినా అక్కడ తాను స్వయంగా ఫోటోలు దిగి వాటిని అప్ లోడ్ చేసేదని తెలిపాడు. అయితే జూలై 9 నుంచి తన భార్యకు, కుమార్ భార్య మంజులు కలుసుకోలేదని స్పష్టం చేశాడు. మేము, మా బంధువులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా, కలవడానికి ప్రయత్నించినా వారి నుంచి ఎటువంటి రిప్లై రాలేదని, వారెక్కడున్నారోనన్న విషయాల గురించి అంచనాలు కూడా వేయలేదన్నాడు. ఆ తరువాత వాళ్ల ఫోన్ లు స్విచ్ఛాఫ్ లు రావడంతో పోలీసులను ఆశ్రయించినట్లు స్పష్టం చేశాడు.

అలాగే కుమార్ కు సంబంధించి అతని ఫ్రెండో మరొకరు ఇతని గురించి వివరిస్తూ... ‘‘కుమార్ తన సొంతూరులో చాలా ఆనందంగా జీవితాన్ని కొనసాగించేవాడు. అందరితో కలిసి మెలిసి వుంటూ.. కష్టాల్లో వున్న వారందరినీ ఆదుకునేవాడు. అతను మూడు సినిమాలకు కో-ప్రొడ్యూస్ కూడా చేశాడు. ఇబ్బందుల్లో మునిగిపోయిన సినిమా నిర్మాతలకు అండగా నిలిచాడు. అటువంటి మనిషి అప్పుల ఇబ్బందుల్లో వున్నాడంటే నమ్మశక్యం కావడం లేదు. నేను అతనిని ఒక నెల క్రితం కలిశాను. కానీ ఇప్పుడు అతని మరణవార్త విని చాలా బాధగా వుందంటూ’’ చెప్పుకొచ్చాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles