Aliya bhatt dating with ranbir kapoor

Aliya bhatt dating with ranbir kapoor in parties, aliya bhatt hot photos, aliya bhatt hot photo shoot, aliya bhatt latest photo shoot, aliya bhatt with ranbir kapoor, ranbir kapoor with aliya bhatt, katrina kaif with ranbir kapoor, aliya dating with ranbir kapoor, aliya and ranbir kapoor caught at night parties, aliya bhatt news, katrina kaif fires on ranbir kapoor

Aliya bhatt dating with ranbir kapoor in the night parties

‘‘కత్తి’’ని పక్కనబెట్టి ఆలియాతో రణబీర్ ‘‘రంకు’’!

Posted: 07/23/2014 05:49 PM IST
Aliya bhatt dating with ranbir kapoor

ప్రస్తుతం బాలీవుడ్ యువతారల్లో ఆలియాభట్ వరుస సినిమాలు చేసుకుంటూ రాజ్యమేలుతోంది. సాధ్యమైనంతవరకు తన అందాలను ప్రదర్శిస్తూ ఇటు ప్రేక్షకులనే కాకుండా స్టార్ హీరోలను సైతం తనవైపు ఆకర్షించుకుంటోంది. లిప్ లాక్ నుంచి బెడ్ రూమ్ లలో న్యూడ్ గా కనిపించే సీన్లలో సైతం నటించడానికి సై అని చెప్పిన ఈ భామ డేట్స్ కోసం దర్శకనిర్మాతలు వరుసపెట్టి మరీ క్యూలు కడుతున్నారు.

అదేవిధంగా ఆలియా మీద ఎన్నో రకాల రూమర్లు కూడా వచ్చాయి. ఆమధ్య అర్జున్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని రూమర్లు రాగా... మొన్నటికి మొన్న వరుణ్ ధావన్ తో రాత్రింబవళ్లు తేడా లేకుండా చట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని పుకార్లు షికార్లు చేశాయి. అలాగే గుట్టచప్పుడు కాకుండా చిత్రపరిశ్రమలోనే మరో యువహీరోతో లవ్వాట ఆడుతోందనే గాసిప్పులు కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఈమె బాయ్ ఫ్రెండ్ ల లిస్ట్ లో బాలీవుడ్ స్లైలిష్ హీరో రణబీర్ కపూర్ కూడా చేరిపోయాడని బాలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి.

అదేంటీ.. రణబీర్, కత్రినా బాయ్ ఫ్రెండ్ కదా! అనే మీ సందేహం. అవును! నిన్నమొన్నటివరకు వీరిద్దరూ అమరప్రేమికులు. పగులూరాత్రిళ్లు పార్టీలు, పబ్బులు అంటూ భలే తిరిగేశారు. సహజీవనం కూడా చేస్తున్నారని వార్తలు వచ్చాయి. వీరి ప్రేమ వ్యవహారం దాదాపు పెళ్లి వరకు కూడా వెళ్లింది. కానీ ఈమధ్య ఈ ప్రేమజంట ఎక్కడ వెతికినా కనిపించడం లేదు. ఎవరికి వారు తమతమ షూటింగుల్లో బిజీగా కాలం గడుతున్నారు.  

ఇదిలావుండగా... రణబీర్, కత్రినా కైఫ్ లు కలిసి నటించాల్సిన చిత్రం గురించి గతంలో కొన్ని వార్తలు వచ్చాయి. అప్పట్లో వారిద్దరూ అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. కానీ తాజాగా రణబీర్ కపూర్ మాత్రం కత్రినా కైఫ్ ను పట్టుబడిమరీ సినిమా నుంచి తొలగించాడని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. పైగా ఆమె స్థానంలో ఆలియా భట్ కు నటించే ఛాన్స్ ఇచ్చాడు. అంతేకాదండోయ్ బాబు... సినిమా అవకాశం ఇచ్చాడనే సాకుతో ఆలియా, రణబీర్ కలిసి అర్థరాత్రి పార్టీలకు తెగ తిరగేస్తోంది. దీంతో వీరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని బాలీవుడ్ కోడై కూస్తోంది. వీరి వ్యవహారం గురించి తెలుసుకున్న కత్రినా కస్సుబస్సుమంటోందని చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles