Kajal agarwal interview item song movies

Kajal agarwal latest news, kajal agarwal item song news, kajal agarwal movies, kajal agarwal movies, kajal agarwal hindi movie, kajal agarwal private photos, kajal agarwal hot photo shoot, kajal agarwal hot stills, kajal agarwal hot photos, kajal agarwal images

Kajal agarwal interview item song movies : Tollywood top heroine kajal agarwal is finally said that she is ready to do item songs.

కాజల్ కు కాసులు లేకే బరితెగించిందా!?

Posted: 08/07/2014 10:32 AM IST
Kajal agarwal interview item song movies

తెలుగుచిత్రపరిశ్రమలో వున్న టాప్ హీరోయిన్లను సైతం తలదన్నేసే విధంగా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఆఫర్లు పొందుతూ స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయిన కాజల్ అగర్వాల్... అదే అదును భావించి తనకు ఇష్టమొచ్చినట్లు రెమ్యునరేషన్ ను పెంచుకుంటూ పోయింది. ఏ హీరోయిన్ కు లేనంత ఇమేజ్ ఈమెకు దక్కడం వల్ల నిర్మాతలు భారీగా డబ్బులు ముట్టజెప్పడానికి కూడా సిద్ధమయ్యారు. అయితే ఇమేజ్ వుంది కదా అని కాస్త బలుపుగా ప్రవర్తించి, ఇంకా ఎక్కువ డబ్బులు కావాలంటూ ఈమె అడగడంతో నిర్మాతలు చేతులు ఎత్తేశారు. అయినా కాజల్ రెమ్యునరేషన్ విషయంలో వెనకడుగు వేయకుండా మొండి వైఖరిని ప్రదర్శించడం వల్ల అమాంతంగా ఆఫర్లు తగ్గిపోయాయి.

ఇక ఈ అమ్మడికి చేసేదేమీ లేక తన రెమ్యునరేషన్ ను కాస్త తగ్గించుకోవడంతో రెండు సినిమాల్లో ఆఫర్ సంపాదించుకుంది. కానీ ఈ అమ్మడికి ఆ డబ్బులు కూడా తక్కువచ్చాయేమో! తనకున్న ఇమేజ్ ను కూడా పట్టించుకోకుండా బరితెగిస్తోందని తాజాగా సమాచారం వెలువడుతోంది. నిన్నమొన్నటివరకు ఐటెంసాంగ్ లకు ససెమిరా అన్న ఈ భామ.. ఇప్పుడు అవి చేయడానికి సిద్ధంగా వున్నానంటూ కేకలు పెట్టి మరీ చెబుతోంది. ‘‘ఐటెం సాంగ్ లు చేయడానికి నేను రెడీగా వున్నాను. ఐటెం సాంగ్ లో డాన్స్ చేయడం నాకు చాలా ఇష్టం’’ అంటూ బహిరంగంగా ప్రకటనలను విడుదల చేస్తోంది. ‘‘ఎంతటి స్టార్ హీరోయిన్ అయినా ఐటెం సాంగ్ చేయడంలో తప్పు లేదు. అలాంటి పాటలు చేసే హీరోయిన్లు అంటే నాకు ఎంతో గౌరవం’’ అని ఈ అమ్మడు తెలుపుతోంది.

తాజాగా కాజల్ అగర్వాల్ ఇంటర్వూలో భాగంగా మాట్లాడుతూ.. ‘‘ఐటెం పాటలకు సంబంధించి నాకు గతంలో కొన్ని అవకాశాలు వచ్చాయి. అయితే అప్పుడు చేతిలో వరుసగా సినిమాలు వుండటం వల్ల డేట్స్ ను అడ్జస్ట్ చేయలేకపోయాను’’ అని స్పష్టం చేసింది. ‘‘మరి ఇప్పుడు ఐటెం సాంగ్ చేయడానికి మీరు రెడీగా వున్నారా..?’’ అని అడిగితే దానికి బదులుగా.. ‘‘ప్రస్తుతం నేను మూడు భాషల్లోనూ సినిమాలు చేస్తున్నాను. వీటికి డేట్స్ సర్దుబాటు చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాను. అందుకే ప్రస్తుతం ఏ ఐటం సాంగ్ చేయడం లేదు. కానీ ఫ్యూచర్లో మాత్రం తప్పకుండా ఐటం సాంగ్ చేస్తాను. అయితే.. నేను చేసే ఐటం సాంగ్ చాలా స్పెషల్ గా వుండాలి. అన్నిటికంటే భిన్నంగా, చాలా ఎట్రాక్టివ్ గా వుండాలి. అప్పుడు చేస్తాను’’ అని స్పష్టం చేసింది.

ఈ అమ్మడు ఇచ్చిన స్టేట్ మెంట్ కొంతమంది సినీ విశ్లేషకులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ‘‘ఇంతటి భారీ ఇమేజ్ వున్నా కూడా ఈ అమ్మడు ఎందుకింత బరితెగిస్తుందోనని’’ ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే ‘‘గీతాంజలి’’ సినిమాలో కాజల్ కు ఐటం సాంగ్ అవకాశం రాగా.. అందుకు ఆమె భారీ పారితోషికం డిమాండ్ చేసి చేజార్చుకుంది. బహుశా మళ్లీ అటువంటి తప్పు చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ అమ్మడు ఈ విధంగా బరితెగించి మాట్లాడి వుంటుందని చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles