Raviteja power movie second trailer

raviteja latest news, raviteja movie news, ravi teja power movie teaser, raviteja power movie second teaser, power movie teasers, ravi teja power movie news, ravi teja hansika, hansika regina, raviteja power movie dialogues

raviteja power movie second trailer : tollywood mass maharaja raviteja latest movie power second trailer released in which raviteja playing police officer role.

‘‘పవర్’’ఫుల్ డైలాగులతో ఊచకోతకోస్తున్న మాస్ రాజా!

Posted: 08/07/2014 06:48 PM IST
Raviteja power movie second trailer

(Image source from: raviteja power movie second trailer)

వరుసగా సినిమాలు పరాజయం కావడంతో రవితేజ కెరీర్ ఇబ్బందుల్లో పడిందని అనుకున్న నేపథ్యంలో ‘‘బలుపు’’ సినిమాతో తిరిగి తనలో వున్న ‘‘ఇడియట్’’ను బయటకు తీశాడు. దాంతో తిరిగి మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చిన రవి... మంచి పాత్రలు వున్న సినిమాలనే ఎంచుకోవాలనే నేపథ్యంలో తిరిగి ‘‘విక్రమార్కుడి’’ అవతారంలో ‘‘పవర్’’ ఫుల్ గా వచ్చాడు. రవితేజ ‘‘పవర్’’ సినిమా ఫస్ట్ లుక్ అదిరిపోయే రేంజులో వుందని టాక్ వినిపిస్తే.. మొదటి టీజర్ యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది. దాంతో ఈ సినిమా మీద అందరూ భారీ అంచనాలే పెట్టుకున్నారు.

ఇప్పుడు తాజాగా పవర్ కు సంబంధించి రెండో టీజర్ కూడా విడుదలైంది. విడుదలైన కొన్ని గంటలకే ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఇందులో రవితేజ ఖాకీ డ్రెస్సులో ‘‘పవర్ ఫుల్’’ డైలాగ్స్ తో రెచ్చిపోయాడు. మాస్ మహారాజాగా పేరు తెచ్చుకున్న ఈ హీరో.. ఈ టీజర్ లో మాసిజం అంటే ఏంటో మొత్తం చూపించేశాడు. ‘‘విక్రమార్కుడు’’ సినిమాలో విక్రమ్ సింగ్ రాథోడ్ గా రవితేజ కొత్త రికార్డులను సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే! ఇప్పుడు మరోసారి అదే ఖాకీ డ్రెస్సులో ఏసీపీ బల్ దేవ్ గా రౌడీల బెండు తీయడానికి రెడీ అవుతున్నాడు. ‘‘వార్నింగ్ లు, వారెంట్లు, జైళ్లు, బెయిళ్లు ఇవేవీ వుండవ్..?’’ అంటూ డైలాగుతో ఊచకోత కోస్తున్నాడు.

బాబి దర్శకత్వంలో వస్తున్న ఈ పవర్ మూవీలో రవితేజ సరసన హన్సిక, రెజీనాలు నటిస్తున్నారు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 10వ తేదీన పాటల్ని విడుదల చేస్తున్నారు. సినిమా రిలీజ్ తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో తాజాగా ఈ టీజర్ ని విడుదల చేశారు. ఇందులో రవితేజ చెప్పిన డైలాగ్, ఆయన సరికొత్త అవతారాన్ని ఎలావుందో మీరు ఒకసారి వీక్షించండి...

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles