Trisha latest tattoos on hands thies of an actor goes viral in kollywood

trisha latest news, trisha hot photo shoot, trisha latest photos, trisha tattoos, trisha hot photos, trisha latest stills, trisha latest tattoos photos, trisha hero ravi, trisha bhoologam movie

trisha latest tattoos on hands thies of an actor goes viral in kollywood : actress trisha latest tattoos on her hands, thies and stomach of an actor ravi goes viral in kollywood.

ప్రేమలో పిచ్చిదైన త్రిష.. బాగానే పొడిపించుకుంది!

Posted: 08/18/2014 01:12 PM IST
Trisha latest tattoos on hands thies of an actor goes viral in kollywood

ఇన్నాళ్లవరకు ‘‘నాకు ఎవరితోనూ ఎఫైర్ లేదు. నాకు బాయ్ ఫ్రెండ్స్ లేరు. నేను సింగిల్ గానే కాలం గడుపుతున్నాను’’ అంటూ చెప్పుకుంటూ వచ్చిన త్రిష బండారం ఇప్పుడు బయటపడిపోయింది. త్రిషకు కూడా బాయ్ ఫ్రెండ్స్ వున్నాడంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇందుకు సాక్ష్యాలుగా ఆమె శరీరం మీద తాజాగా కనిపిస్తున్న తాత్కాలిక పచ్చబొట్ల ఫోటోలను కూడా చూపిస్తూ మరీ ‘‘త్రిష బాయ్ ఫ్రెండ్ దొరికిపోయాడంటూ’’ కథనాల మీద కథనాలు వెలువడుతున్నాయి. ఆ పచ్చబొట్లు మరెవరివో కాదు.. తమిళ హీరో ‘‘జయం’’ రవికి సంబంధించినవి! దీంతో వీరిద్దరి పీకల్లోతుదాకా ప్రేమలో మునిగిపోయారని.. ముఖ్యంగా త్రిష అయితే హద్దులుదాటి అతని ప్రేమలో మునిగిపోయిందని.. అందుకే ఈ పచ్చబొట్లను పొడిపించుకుందని వార్తలు షికార్లు చేస్తున్నాయి.

ఇక్కడో ముఖ్యమైన విషయం ఏమిటంటే... త్రిష కూడా ఈ విషయాన్ని అంగీకరించడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ‘‘నాకిప్పుడు బాయ్ ఫ్రెండ్ వున్నాడు.. అతనికోసం నా ఒంటిమీద ఎక్కడబడితే అక్కడ అతని ఫోటోను పచ్చబొట్లుగా పొడిపించుకున్నాను’’ అంటూ స్వయంగా తానే చెప్పుకోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. కేవలం చెప్పడం వరకు మాత్రమే కాదు.. త్రిష పొడిపించుకున్న తన బాయ్ ఫ్రెండ్ ఫోటోలను సాక్షాలుగా చూపించి మరీ చెబుతోంది. దీంతో వీరి ప్రేమ వ్యవహారం నిజమేనని అనుకుంటున్న తరుణంలో.. చివరికి త్రిష కుండబద్ధలు కొట్టేసింది. ఆ పచ్చబొట్లు వెనుక వున్న అసలు రహస్యాన్ని ఈ అమ్మడు బయటపెట్టేసింది. ఇది రియల్ ప్రేమ కాదు.. రీల్ ప్రేమ మాత్రమే అంటూ అమ్మడు పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేసింది.

మూడుపదుల భామ త్రిష, తమిళ హీరో రవి జంటగా ‘‘భూలోగం’’ అనే సినిమా రూపొందుతోంది. ఇందులో రవి అంటే తనకెంత ఇష్టమో వ్యక్తం చేసే ఓ సన్నివేశం వుంటుంది. అందులో భాగంగా.. ‘‘చూడు.. నీమీదున్న ప్రేమతో నేను నా దేహాన్ని ఎలా హింస పెట్టుకున్నానో.. నీ ఫోటోలతో ఎక్కడబడితే అక్కడ పచ్చబొట్లను పొడిపించుకున్నాను’’ అంటూ రవికి త్రిష ఆ పచ్చబొట్లు చూపించే సీన్ గా వుంటుంది. దర్శకుడు కల్యాణ్ కృష్ణన్ ఈ పచ్చబొట్ల గురించి చెప్పిన మొదట త్రిష కుదరదని తెగేసి చెప్పిందట! అయితే ఆ సీన్ డిమాండ్ గురించి వివరించడంతో చివరికి అందుకు ఓకే చేసిందని సమాచారం. సాధారణంగానే త్రిషకు పచ్చబొట్లు పొడిపించుకోవడం చాలా ఇష్టం. ఇందుకు ఉదాహరణగా ఆమె ఎద భాగంలో వున్న ‘‘నీమో ఫిష్’’ టాటూ స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా సినిమాలో హీరో ప్రేమలో పిచ్చిదై.. చేతులు, తొడ, పొట్ట భాగాల్లో పచ్చబొట్లు వేసుకుని దర్శనమివ్వబోతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం.. త్వరలోనే విడుదలకు సిద్ధమౌతోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : actress trisha  trisha tattoos  trisha movies  trisha hero ravi  

Other Articles