Ram charan govindudu andari vadele movie story leaked

ram charan latest news, ram charan movies, govindudu andari vadele movie, govindudu andari vadele movie story, govindudu andari vadele movie review, govindudu andari vadele movie, tollywood hero srikanth, prakash raj, kajal agarwal latest news, kamilini mukherjee latest news, director krishna vamsi news, producer badla ganesh

ram charan govindudu andari vadele movie story leaked : tollywood mega power star ram charan lateset movie govindudu andari vadele story leaked. This story is remake to akkineni movie seetha ramaiah gari manavaralu. These rumours are running in tollywood film industry

‘‘గోవిందుడి’’ కథ లీక్.. పాత స్టోరీనే రీమేక్ చేశారట!

Posted: 08/18/2014 05:29 PM IST
Ram charan govindudu andari vadele movie story leaked

రామ్ చరణ్ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న చిత్రం ‘‘గోవిందుడు అందరివాడేలే’’! ప్రస్తుతం ఈ సినిమా స్టోరీ మొత్తం కాపీ కొట్టారనే టాక్ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. పాత స్టోరీలో వున్న కొన్ని పాత్రలను తారుమారు చేసి, నేటి యువతరాలకు - కుటుంబసభ్యులకు తగినట్టుగా స్టోరీలో కొద్దిపాటి మార్పులు చేశారని టాక్ వినిపిస్తోంది. గతంలో కూడా ఈ మూవీ సేమ్ ‘‘మురారీ’’లాగే వుందంటూ అప్పట్లో బాగానే ప్రచారాలు కొనసాగాయి. ఇప్పుడు కూడా అటువంటి రూమర్సే చిత్రపరిశ్రమలో చక్కర్లు కొడుతున్నాయి. పైగా ఈ సినిమా కథను కూడా లీక్ చేశారు.

కట్ చేస్తే.. గోవింద్ (రామ్ చరణ్) పుట్టకముందు అతని తండ్రి తన తల్లిదండ్రులను ఎదురించి ప్రేమ వివాహం చేసుకుంటాడు. అనంతరం విదేశాలకు వెళ్లి అక్కడ సెటిల్ అవుతాడు. కొన్నాళ్ల తర్వాత వీరికి గోవింద్ (రామ్ చరణ్) అనే అబ్బాయి పుడతాడు. గోవింద్ పెరిగి పెద్దవాడైన తర్వాత తన తండ్రి కోరిక మేరకు ఇండియాలో వున్న తన తాత దగ్గరకు చేరుకుంటాడు. అయితే అప్పటికే తానెవరో అసలు విషయం చెప్పకుండా వారితో కలిసిమెలిసి వుంటూ వారినుంచి అప్యాయతలు అన్నీ రుచి చూస్తాడు. అయితే ఇటువంటి మంచి మనుషులను మోసం చేయడం తగదని భావించి గోవింద్... తానెవరో..? ఎక్కడి నుంచి వచ్చాడో..? ఎందుకు వచ్చాడో..? నన్న మొత్తం విషయాలను ఆ కుటుంబసభ్యులకు చెప్పాలని అనుకుంటాడు. కానీ ఆ విషయం వేరేవారి వల్ల వారికి తెలిసిపోతోంది. దీంతో కుటుంబసభ్యులు గోవింద్ పై ద్వేషం పెంచుకుంటారు.

అయితే ఇంతలోనే గోవిందుడు తల్లిదండ్రులు ఓ ప్రమాదంలో చనిపోతారు. ఇక అంతే! అక్కడి నుంచి ఫుల్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుంది. గోవిందుడు తిరిగి తన తాతతో, కుటుంబసభ్యులతో కలిసిపోతాడు. ఇదే ‘‘గోవిందుడు’’ మూవీ కథ! ఈ కథను మనం బాగా గమనిస్తే.. గతంలో అక్కినేని, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన ‘‘సీతారామయ్యగారి మనవరాలు’’ అనే సినిమానే గుర్తుకు వస్తుంది. ఇందులో వున్న మీనా పాత్రను ఇప్పుడు రామ్ చరణ్ కు అప్పగించారు. అయితే ఈ కథలో కొన్ని మార్పుచేర్పులు వుంటాయని చిత్ర యూనిట్ సభ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా క్లైమాక్స్ సీన్ చిత్రీకరణ కూడా ముగిసింది. అందులో ‘‘గోవిందుడు అనాథ కాదు.. అందరివాడేలే’’ అంటూ శుభం కార్డు వస్తుంది. దీంతో ఈ సినిమా పూర్తిగా పాత స్టోరీనే కాపీ కొట్టి రీమేక్ చేశారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతో నిజముందో..? లేదో..? తెలియాలంటే.. సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ఆగాల్సిందే!

ఫ్యామిలీ కుటుంబకథా చిత్రాలను తెరకెక్కించే డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళంలో తనదైన ముద్ర వేసుకున్న యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇందులో చరణ్ కు బాబాయ్ గా హీరో శ్రీకాంత్ నడిస్తుండగా.. అతనికి జోడీగా కమిలినీ ముఖర్జీ నటిస్తోంది. ఇక ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో తాతగా కనిపించబోతున్నాడు. పరమేశ్వర బ్యానర్ లో బండ్లగణేష్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఓ పాట మినహా ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. మిగిలి వున్న కొంత ప్యాచ్ వర్క్ ను ఈ నెల 20నుంచి హైదరాబాద్ లో పూర్తి చేయనున్నారు. అక్టోబర్ 1వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles