Rabhasa release may delayed

rabhasa, rabasa movie release date, rabhasa audio mp3 songs, junior ntr, ntr, ntr movies, ntr latese movies, nandamuri family, nandamuri fans, tollywood, latest news, bellamkonda suresh, bellamkonda srinivas, alludu seenu

ntr rabhasa movie may delayed because bellamkonda not paid remunerations to team : bellamkonda suresh not paid remuneration to rabhasa team because of alludu seenu loss

రభస విడుదల వాయిదా

Posted: 08/20/2014 03:29 PM IST
Rabhasa release may delayed

జూనియర్ ఎన్టీఆర్ రభసను చూడాలంటే ఫ్యాన్స్ కొంతకాలం వెయిట్ చేయక తప్పదు. రభస విడుదల వాయిదా తప్పేలా లేదు. ముందుగా ఈనెల 29న సినిమా రిలీజ్ చేద్దామనుకున్నారు. నిర్మాత బెల్లంకొండ సురేష్ సినిమా యూనిట్ కు సురేష్ రెమ్యూనరేషన్ ఇవ్వలేదట దీంతో విడుదల ఆగిపోతుంది. సురేష్ కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ తొలి చిత్రం "అల్లుడు శీను" ఆశించిన ఫలితానివ్వలేదు. దీంతో దాదాపు 10కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్న సురేష్.., రభసతో పాటు అల్లుడు శీను సినిమా ఫైనాన్సియర్లకూ డబ్బులివ్వలేదట. ఇదిలా ఉంటే శ్రీనివాస్ తో సినిమా తీసే డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు అడ్వాన్స్ ఇవ్వటం వల్ల డబ్బులు లేవని కూడా ఫిలింనగర్ టాక్.

అయితే తన కొడుకు సినిమా ఆడకపోయినా రెండవ సినిమా కోసం అడ్వాన్స్ ఇస్తున్న సురేష్, ఎన్టీఆర్ సినిమాకు బాకీలు తీర్చకపోవటంపై నందమూరి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సురేష్ స్వార్ధంతో వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ మద్యే విడుదలైన రభస సాంగ్స్ కు మంచి స్పందన వచ్చింది. దీంతో సినిమా కూడా హిట్టవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తుండగా.., ఇలా వాయిదాలు పడటంతో ఇతరులకు అవకాశం ఇచ్చినట్లవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇదే రోజున విడుదల కావాల్సిన మరో ఇద్దరు హీరోల సినిమాలు యధాతధంగా వస్తుండగా.., ఎన్టీఆర్ మాత్రమే కాస్త ఆలస్యంగా రభస చేస్తానంటున్నాడు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rabhasa  bellamkonda suresh  ntr  tollywood news  

Other Articles