No change in rabhasa release

rabhasa, rabasa movie release date, rabhasa audio mp3 songs, junior ntr, ntr, ntr movies, ntr latese movies, nandamuri family, nandamuri fans, tollywood, latest news, bellamkonda suresh, bellamkonda srinivas, alludu seenu

rabhase movie going to release on 29th august no change in it : rabhase releasing on scheduled date on 29th august sasy bellam konda suresh

రిలీజ్ పై రభస

Posted: 08/20/2014 05:53 PM IST
No change in rabhasa release

రభస సినిమా విడుదలపై రోజుకో మాట విన్పిస్తోంది. ముందుగా విడుదల ఈనెల 29న అని సినిమా యూనిట్ ప్రకటించింది. ఆ తర్వాత వాయిదా పడిటనట్లు టాక్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 29న ఖచ్చితంగా విడుదల అవుతుందని చెప్తున్నారు. అయితే ఈసారి నిర్మాత బెల్లంకొండ సురేష్ స్వయంగా చెప్పటంతో ముందుగా అనుకున్న ముహూర్తానికే వస్తుందని అంతా అంటున్నారు. ప్లాన్ ప్రకారమే 29న ప్రేక్షకులకు రభస అందుతుందని నిర్మాత ప్రకటించాడు. కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన ఆడియోకు కూడా మంచి స్పందన వచ్చిందన్నారు. ముఖ్యంగా తారక్ స్వయంగా పాడిన రాకాసి.., రాకాసి పాట అందరి నోటా విన్పిస్తోందన్నారు. త్వరలోనే ఆడియో ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుకను నిర్వహిస్తామన్నారు. సినిమా ఖచ్చితంగా ఎన్టీఆర్ కెరీర్ కు మంచి మైలేజ్ ఇస్తుందన్నారు.

బెల్లంకొండ సురేష్ నిర్మాతగా వస్తున్న ఈ సినిమాలో సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతమందించగా.., సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేశారు. సినిమా యూత్ ఫుల్, మాస్ మరియు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని డైరెక్టర్ చెప్పాడు. ప్రతినిమిషాన్ని అభిమానులు ఎంజాయ్ చేస్తారని.., ప్రతి ఒక్కరూ తప్పక ఒకటి కంటే ఎక్కవసార్లు చూస్తరని సంతోషంగా తెలిపాడు. రభస సినిమా విడుదలపై ముందుగా అనేక ఊహాగానాలు వచ్చాయి. సినిమా యూనిట్ కు సురేష్ రెమ్యూనరేషన్ ఇవ్వకపోవటంతో విడుదల ఆగిపోయిందని టాక్ వచ్చిది. సురేష్ కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ తొలి చిత్రం "అల్లుడు శీను" ఆశించిన ఫలితానివ్వలేదు. దీంతో దాదాపు 10కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్న సురేష్.., రభసతో పాటు అల్లుడు శీను సినిమా ఫైనాన్సియర్లకూ డబ్బులివ్వలేదట. ఇదిలా ఉంటే శ్రీనివాస్ తో సినిమా తీసే డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు అడ్వాన్స్ ఇవ్వటం వల్ల డబ్బులు లేవని కూడా ఫిలింనగర్ టాక్. దీంతో నందమూరి ఫ్యాన్స్ మండిపడ్డారు. కొడుకు సినిమాల కోసం అడ్వాన్స్ ఇస్తున్న సురేష్, విడుదలకు సిద్ధమైన సినిమా బాకీలు మాత్రం తీర్చటం లేదని విమర్శించారు. చివరకు 29నే రభస రచ్చ చేస్తుందని చెప్పటంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rabhasa  bellamkonda suresh  ntr  tollywood news  

Other Articles