Nanditha against lip kiss scenes and skin show in movies

nandtha, actress nandtha images, nanditha profile, nanditha movies, prema katha chitram, arundhati, anushka, kshana kshanam, sridevi, telugu news, tollywood news, latest updates, movies, lovers movie

actress nanditha stated that she is against lip kisses and skin show in movies : nanditha will not act in lip lock and skin show scenes

నావి ఆరవు కదా !!

Posted: 08/20/2014 05:22 PM IST
Nanditha against lip kiss scenes and skin show in movies

అందాల ఆరబోతలో హీరోయిన్లు పోటి పడుతున్నారు. చిన్నప్పటి బట్టలేసుకునేందుకు తహతహలాడుతున్నారు. ఇష్టమున్నా, లేకపోయినా తమ అందాలను కెమెరాల్లో బంధిస్తున్నారు. అయితే నందిత మాత్రం ఇవన్నీ జాన్తా నై అంటోంది. తన దగ్గర ఈ పప్పులన్నీ ఉడకవట. అందాలు ఆరబోయటాలు, వడపోయటాలు, వండి వడ్డించటాలు అంటే ఇంకొకర్ని చూసుకోండని తెగేసి చెప్తోంది. ప్రేమకధా చిత్రం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన నందిత.., సినిమాల్లో స్కిన్ షో చేయనని చెప్తోంది. అంతేకాదు లిప్ కిఠస్ లు కూడా తన నుంచి ఆశించవద్దని స్పష్టం చేస్తోంది. నటన ఎంత కావాలన్నా తీసుకోండి కాని.., ఎక్స్ పోజింగ్ మాత్రం అండర్ మై కంట్రోల్ అంటోంది.

ఆర్మీ కుటుబం నుంచి వచ్చిన తాను ఎక్స్ పోజింగ్ కు దూరమని స్పష్టంచేసింది. ఒళ్ళు కన్పించే సీన్లలో తనెప్పుడూ నటించనని ప్రకటించింది. ఫ్యాన్స్ కూడా తనను అలా చూడాలని కోరుకోవద్దని చెప్తోంది. నందిత అంటే ఓ సింపుల్ అమ్మాయి, లేదా కొంచెం గ్లామరస్ గాల్. అంతే అంతకు మించి ముందుకెళ్ళే ప్రయత్నం చేయవద్దని అభిమానుల ఆశలపై చన్నీళ్ళు చల్లుతోంది. అరుంధతిలోని జేజమ్మ క్యారెక్టర్, క్షణంక్షణంలో శ్రీదేవి క్యారెక్టర్లు డ్రీమ్ రోల్స్ అని నందు చెప్తోంది. కెరీర్ లో ఒక్కసారైనా అలాంటి పాత్రలో నటించాలని కోరికట. ఈ కోరిక త్వరలోనే తీరాలని కోరుకుందాం.

నీకు నాకు  డ్యాష్ డ్యాష్ సనిమాతో తెలుగు తెరంగేట్రం చేసిన నందిత ప్రేమ కథా చిత్రం సినిమాతో పాపులర్ అయింది. ఆ సినిమాలో నందు క్యారెక్టర్ ప్రేక్షకులను కడుపునొప్పొచ్చేలా నవ్వించింది. తాజాగా విడుదలైన లవర్స్ కూడా మంచి పేరు తెచ్చింది. దీంతో ఇప్పుడిప్పుడే ఇంటిముందు కాస్త రద్దీ పెరిగిందని చెప్తోంది అమ్మడు. త్వరలనే కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అనే సినిమాలో సుధీర్ బాబు పక్కన నందు నటిస్తోంది. ఇక తన మళయాళ మూవి లవ్ ఇన్ లండన్ కూడా త్వరలో తెలుగులో రిలీజవుతుందని చెప్తోంది. సో అందాలను కాకుండా అభినయాన్ని చూడాలని చెప్తున్న నందు మాట ఎంతమంది వింటారో చూడాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nanditha  lovers movie  tollywood  lip lock  

Other Articles