Bomb threat call to ajith home

hero ajith, bomb call to ajth, fake calls, bollywood news, tollywood news, latest news, ajith movies, chennai, heros, police, bomb squad, facebook, twitter

police searched in ajith home by he receiving bomb threat call : hero ajith received bomb threat call police searched and said no bomb in home

అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు !!

Posted: 08/30/2014 01:24 PM IST
Bomb threat call to ajith home

సినీ నటుడు అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. పోలిసులను తెల్లవారుజామున ఉరుకులు పరుగులు పెట్టించింది. అజిత్ ఇంటికి ఈ తెల్లవారుజామున ఫోన్ చేసిన ఓ వ్యక్తి ఇంట్లో బాంబు పెట్టినట్లు సమాచారం ఇచ్చాడు. వెంటనేఅప్రమత్తమైన సెక్యురిటీ సిబ్బంది పోలీసులకు ఫోన్ చేశారు. రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ ఇంటినంతా సోదా చేసింది.., అణువణువూ గాలించింది. అయితే బాంబు లేకపోవటంతో, ఫేక్ కాల్ అని నిర్ధారించుకుంది.

బెదిరింపు కాల్ ఉత్తిదే అని తేలటంతో అజిత్, కుటుంబ సభ్యులు, పోలిసులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ ఫోన్ ఎవరు చేశారనే విషయంపై పోలిసులు ధర్యాప్తు చేస్తున్నారు. ఓ సినిమాలో అజిత్ బాంబు నిర్వీర్యం చేసే నిపుణుడుగా నటించాడు. అటువంటి నటుడికి బాంబు బెదిరింపు వచ్చిందా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ‘తాళ 55’ అనే సినిమాలో నటిస్తూ..,షూటింగులో బిజీగా ఉన్నాడు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ajith  bomb threat  police  twitter  

Other Articles