Manchu manoj current theega movie teaser released

manchu manoj, current theega movie, current theega movie teaser, manchu manoj current theega movie, sunny leone, rakul preet singh, shilpi sharma, current theega movie starcast, manchu vishnu, mohan babu

manchu manoj current theega movie teaser released

హై-వోల్టేజ్ తో అదిరిపోయిన కరెంట్ తీగ టీజర్!

Posted: 09/03/2014 12:16 PM IST
Manchu manoj current theega movie teaser released

(Image source from: manchu manoj current theega movie teaser released)

మంచు మనోజ్ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న చిత్రం ‘‘కరెంట్ తీగ’’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు పోస్టర్లను విడుదల చేసిన విషయం తెలిసిందే! అవి చాలా అద్భుతంగా వున్నాయంటూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ కూడా లభించింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ యాక్షన్ టీజర్ ను రిలీజ్ చేశారు. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని డా.మోహన్ బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మిస్తున్నాడు. టైటిల్ కు తగ్గట్టుగానే మంచు మనోజ్ టీజర్ లో అద్భుతంగా తన యాక్షన్ కోణాన్ని కనబరిచాడు.

‘‘కరెంట్ తీగ’’ సినిమాలో మంచుమనోజ్ సరికొత్త అవతారంలో కనిపించబోతున్నట్లు గతంలో వచ్చిన వార్తలు తెలిసిందే! ఇంకొక విషయం ఏమిటంటే.. మనోజ్ నటించిన దాదాపు అన్ని సినిమాలు వైవిధ్యమైనవి! కొత్తకొత్త స్ర్కిప్ట్ లతో ప్రయోగాలు చేస్తూ.. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించడంలో మనోజ్ ఎప్పటికీ ముందుంటాడు. గత సినిమాలతో పోల్చుకుంటే ఇందులో మనోజ్ తన బాడీని భారీగా బిల్డప్ చేసుకొని.. కండలవీరుడిగా దర్శనమిచ్చాడు. అంతేకాదు.. ఈ సినిమాలో స్టంట్స్ కొరియోగ్రఫి స్వయంగా మనోజే చేశాడు. ‘‘పాండవులు పాండవులు తుమ్మెద’’ క్లైమాక్స్ ఎపిసోడ్ లో కూడా మనోజ్ యాక్షన్ స్టంట్స్ కొరియోగ్రఫీ చేశాడు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా... పోర్న్ స్టార్ సన్నీలియోన్ హాట్ టీచర్ పాత్రలోనూ, గ్రీన్ సిగ్నల్ ఫేమ్ శిల్పిశర్మ ఐటంసాంగ్ లో కనువిందు చేసి.. ఈ మూవీకి మరింత వోల్టేజ్ పెంచేందుకు సిద్ధమయ్యారు. యాక్షన్ ఎంటర్టైన్ మెంట్ తోపాటు అన్ని హింగులతో కూడిన ఈ మూవీని అక్టోబర్ లో విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం! మరి టీజర్ లో రెచ్చిపోయిన మాదిరే మంచు మనోజ్ మరో హిట్ సాధిస్తాడో లేదో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : manchu manoj  current theega movie  sunny leone  shilpi sharma  rakul preet singh  

Other Articles