Tapsee pannu twitter comments

tapsee pannu latest news, tapsee pannu twitter, tapsee twitter account, tapsee hot photo shoot, tapsee latest movies

tapsee pannu twitter comments

అవకాశం కోసం తహతహలాడుతున్న తాప్సీ!

Posted: 09/03/2014 01:57 PM IST
Tapsee pannu twitter comments

(Image source from: tapsee pannu twitter comments)

తెలుగు ప్రేక్షకులను తన సొట్టబుగ్గల మాయాజాలంలో కట్టిపడేసిన తాప్సీ.. ఇప్పుడు ఒక్క అవకాశం కోసం తహతహలాడుతోంది. ఈమె నటించిన చిత్రాలన్నీ వరుసగా పరాజయం అయినప్పటికీ.. దర్శకనిర్మాతలు ఈమె డేట్స్ కోసం క్యూలు కట్టేవారు. తెలుగుతోపాటు తమిళ భాషలోనూ ఈ అమ్మడు ఒక వెలుగు వెలిగేసింది. అయితే ఈమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడటంతో దర్శకనిర్మాతలు ఈమెను పక్కనపెట్టేశారు. దీంతో తన ఫిల్మ్ కెరీర్ ను ముందుకు సాగించుకోవడం కోసం సౌత్ నుంచి బాలీవుడ్ కి మకాం మార్చేసింది. అక్కడకు వెళ్లిన వెంటనే తనకు ఒక మూవీ ఆఫర్ వచ్చినప్పటికీ... ఇప్పుడు అవకాశం ఇవ్వండంటూ వేడుకుంటోంది. అయితే ఈమె అవకాశం అడుగుతోంది మూవీకోసం కాదులెండి.. అది తెలుసుకోవాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే!

ప్రస్తుతం ముంబైలో వున్న తాప్సీ.. అక్కడ వాతావరణ విశేషాల గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన ట్వీట్లు చేసింది. ముంబైలో ఈమధ్య వర్షాలు భారీగా కురుస్తున్న విషయం అందరికీ తెలిసిందే! అయితే ఢిల్లీలో మాత్రం వర్షాలు పడక ప్రజలు వేడితో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషయాన్నే తాప్సీ గుర్తు చేసుకుంటూ.. ‘‘ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికి ఇక్కడ చాలు.. మరోవైపు ఢిల్లీలో వర్షాలు లేక అందరూ బాధపడుతున్నారు. కొద్దిగా ఈ వర్షాన్నీ అక్కడ మళ్లించే అవకాశం నాకొస్తే ఎంత బాగుంటుందో’’నంటూ తన ట్విటర్ లో సరదాగా పోస్ట్ చేసింది. అలాగే వినాయక చవితి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకున్నామని.. వినాయకుడు దిగొచ్చి వర్షాల ప్రభావాన్ని మారుస్తాడంటూ చెబుతోంది. దీంతో ఈమె చేసిన ట్వీట్లకు అందరూ ఇవేం సరదాలు బాబు..! అంటూ చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tapsee pannu  twitter  tollywood  bollywood  

Other Articles