Pawan kalyan dissappointed his fans for the second time

pawan kalyan, pawan kalyan latest news, pawan kalyan gopala gopala movie, gopala gopala movie news, gopala gopala movie first look, gopala gopala movie teaser, venkatesh pawan kalyan, gopala gopala movie actresses

pawan kalyan dissappointed his fans for the second time : pawan kalyan fans dissapointed for the second time for not releasing his latest movie gopala gopala first looks

పవన్ ఇచ్చిన షాక్ కు.. సొమ్మసిల్లిపోయిన అభిమానులు!

Posted: 09/03/2014 06:02 PM IST
Pawan kalyan dissappointed his fans for the second time

(Image source from: pawan kalyan dissappointed his fans for the second time)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫాలోయింగ్ తెలుగుచిత్రపరిశ్రమలో ఏ రేంజిలో వుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పవన్ సినిమా విడుదలవుతోందంటే చాలు... ఒకవైపు అభిమానులు పండగ చేసుకుంటే.. మరోవైపు జనాల్లో తెగ క్యూరియాసిటీ కనిపిస్తుంటుంది. టాలీవుడ్ లో ఇంతవరకు ఏ హీరోకు సాధ్యంకాని రీతిలో పవన్ ఒక్కరే తన ప్రతిభతో, మంచి మనస్తత్వంతో కోట్లాదిమంది అభిమానులను పొగేసుకున్నారు. ఈయనకు సంబంధించిన ఏదైనా ఒక విషయం వెలువడితే చాలు.. తర్వాత దానిని అభిమానులే పబ్లిసిటీ చేసిపడేస్తారు. పవన్ ఝలక్ కోసం ఎంతోమంది నిత్యం ఎదురుచూస్తుంటారు. అది పవన్ కల్యాణ్ పవరేంటో! అయితే అటువంటి పవర్ స్టార్ తాజాగా ఇచ్చిన షాక్ తో అతనిని దేవుడిలా కొలిచే అభిమానులు పూర్తిగా సొమ్మసిల్లిపోయారు. వారి ఆశలను అడియాశలు చేసేశాడు.

‘‘అత్తారింటికి దారేది’’ సినిమా తర్వాత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫుల్ బిజీ అయిపోయిన పవన్ కల్యాణ్ ముఖానికి మేకప్ వేసుకోలేదు. అంటే.. ఏ ఇతర చిత్రాల్లో నటించలేదు. అయితే చాలారోజుల గ్యాప్ తర్వాత ఆయన ‘‘గోపాల గోపాల’’ సినిమాను ఎన్నో తర్జనభర్జనల మధ్య చివరకు ఒప్పుకున్నాడు. దీంతో తమ అభిమాన నటుడి చిత్రం మొదలైందని అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమై ఇప్పటికే చాలారోజులయ్యింది. పైగా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోందని యూనిట్ సభ్యులు కూడా పేర్కొంటున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ ప్రయోగాత్మకంగా మోడ్రన్ శ్రీకృష్ణుడి అవతారంలో కనిపిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, పవర్ స్టార్ కొత్త గెటప్ ఎలా వుంటుందోనని ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు.

ఈ నేపథ్యంలో శ్రీకృష్ణాష్టమి పండుగ సందర్భంగా పవన్ ‘‘గోపాల గోపాల’’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తామని అప్పట్లో దర్శకనిర్మాతలు పేర్కొన్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు రిలీజ్ చేయలేకపోయారు. దీంతో అప్పుడే పవన్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కానీ ఇంతలోనే పవన్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్టు ఇండస్ట్రీవర్గాల నుంచి వార్తలు వచ్చాయి. ఈ వార్త రాగానే పవన్ అభిమానులు సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టేశారు. ఫస్ట్ లుక్ రిలీజ్ కోసం ఎంతో ఆత్రుతగా వేచి చూశారు. పెద్ద పండుగల నిర్వహించుదామనుకుని అన్ని కార్యక్రమాలను సిద్ధం చేసుకున్నారు కానీ... ఆరోజు కూడా పవన్ ఫస్ట్ లుక్ రిలీజ్ కాలేదు. అయితే మునుపటిదానికంటే ఈసారి పవన్ అభిమానులు తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. పవన్ బర్త్ డేనాడే ఫస్ట్ లుక్ రిలీజ్ అయితే చాలా ఘనంగా వేడుకలు నిర్వహించుకుందామని ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులు అడియాశలే మిగిలాయి.

ఇదిలావుండగా.. పవన్ ఫస్ట్ లుక్ ను ఎందుకు రిలీజ్ చేయలేదన్న విషయాన్ని నిర్మాత డి.సురేష్ బాబు విశదీకరించారు. ‘‘పవన్ కొద్దిరోజులు మాత్రమే ఈ సినిమా నటిస్తున్నాడు. ఇంకా అతని షూటింగ్ పార్ట్ మిగిలివుంది. అతడి క్యారెక్టర్ చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఫస్ట్ లుక్ ను చాలా బెస్ట్ గా రిలీజ్ చేస్తామని’’ ఆయన పేర్కొన్నారు. ఒకవేళ అన్ని కలిసి వస్తే ఫస్ట్ టీజర్ ను కూడా రిలీజ్ చేస్తామని అభిమానులు తియ్యని కబురు ఇచ్చారు. ఏదేమైనా.. పవన్ పుట్టినరోజునాడు అతని తాజా చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ కాకపోవడం అభిమానులకు పెద్ద డిసప్పాయింటేనని విశ్లేషకులు చెబుతున్నారు. ముందుముందు ఇలాగే చేస్తూపోతే.. దాని ప్రభావం సినిమామీద పడే అవకాశాలున్నాయని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  gopala gopala movie  venkatesh  producer d suresh babu  

Other Articles